టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ ఆ స్టార్ హీరో మాత్రమే.. ఎలాంటి రోల్ ఇచ్చినా న్యాయం చేస్తాడంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ హీరో( All Rounder Hero ) ఎవరనే ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు.

అయితే ఎక్కువమంది మాత్రం ఆ ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) పేరును సమాధానంగా చెబుతారు.

ఎలాంటి పాత్ర ఇచ్చినా నూటికి నూరు శాతం న్యాయం చేసే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎవరూ సాటిరారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న తారక్ ప్రస్తుతం దేవర సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు.

మరోవైపు దేవర( Devara Movie ) గ్లింప్స్ ఇప్పటికే సిద్ధమైందని తెలుస్తోంది.దర్శకుడు కొరటాల శివ( Koratala Siva ) గ్లింప్స్ ను ఇప్పటికే సిద్ధం చేశారని జనవరి మొదటివారంలో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.

మరో వారం రోజుల్లో కళ్యాణ్ రామ్ డెవిల్( Devil Movie ) విడుదల కానున్న నేపథ్యంలో దేవర గ్లింప్స్ రిలీజ్ ఆలస్యం కానుందని తెలుస్తోంది.

దేవర రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్ సంతోషంతో ఉన్నారు. """/" / సముద్ర తీరాల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా తారక్ ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలు మించేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.

జాన్వీ కపూర్ రూపంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో బెస్ట్ ఆప్షన్ దొరికినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

"""/" / దేవర సినిమా తారక్ కెరీర్ కు బెస్ట్ మూవీగా నిలవడంతో పాటు పాన్ ఇండియా హిట్ కావడానికి అవసరమైన అన్ని అంశాలతో తెరకెక్కుతోంది.

దేవర వచ్చే ఏడాది విడుదల కానుండగా దేవర 2 మూవీ( Devara 2 ) ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.

భవిష్యత్తు సినిమాల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సరైన ప్లానింగ్ తో ముందుకెళుతున్నారు.తారక్ పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.

కొడుకు గౌతమ్ ను చూసి తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా.. మహేష్ బాబు పోస్ట్ వైరల్!