సీత.. ఆ పేరులో ఏదో మ్యాజిక్ ఉంది మాస్టారు.. ఆ పేరు హిట్టు కొట్టాల్సిందే!
TeluguStop.com
సినిమాలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.సినిమాని సినిమా పరంగా చూడకుండా సినిమాను లోతుగా పరిశీలించి చూస్తుంటారు కొందరు ప్రేక్షకులు.
మరికొందరు లోతుగా చూడకుండా మామూలుగా ఏదో అన్నట్లుగా చూసి విడిచిపెడతారు.కొన్నిసార్లు పాత్రలను కూడా బాగా లోతుగా పరిశీలిస్తుంటారు ప్రేక్షకులు.
నటీనటుల పాత్రలను ఎంటర్టైన్మెంట్ గా చూడకుండా ఆ పాత్ర వెనుక ఉన్న అర్ధాన్ని చూస్తారు.
అలా సినిమాలో ఒక కథనే కాకుండా పాటలను, నటీనటుల పాత్రలను బాగా గమనిస్తారు.
ఇక కొన్ని సినిమాలలో హీరోయిన్ల పేర్లు, హీరోల పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి.
మరికొన్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి.అంటే నాచురల్ గా అనిపిస్తుంటాయి.
నిజానికి దర్శకులు కథకు తగ్గట్టుగా పాత్రలు.పాత్రకు తగ్గట్టుగా పేరును పెడుతుంటారు నటీనటులకు.
అలా ప్రతి సినిమాలో నటీనటుల పేర్లు అలాగే ఉంటాయి.హీరోయిన్ల పేర్లలో కొన్ని తెలియకుండానే మంచి ఫీలింగ్ కనిపిస్తుంది.
అందులో సీత అనే పేరు మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.నిజానికి ఆ పేరులో ఏదో మ్యాజిక్ ఉన్నట్లు అనిపిస్తుంది.
అలా ఇప్పటికి పలు సినిమాలు విడుదల కాగా అందులో కొందరి హీరోయిన్ల పాత్ర పేర్లు సీత అని ఉండగా ఆ సినిమాలకు హీరోయిన్ పాత్ర ప్లస్ పాయింట్ గా అయ్యింది.
ఆ పేరుతో ఉన్న సినిమాలు అన్నీ మంచి సక్సెస్ ను అందుకుంటాయి.ఇదిలా ఉంటే ఈ పేరుతో ఉన్న కొన్ని సినిమాలు ఉండగా.
ఇంతకు ఆ సినిమాలు ఏంటంటే.h3 Class=subheader-styleసీతారామం:/h3p ఇటీవలే హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన సినిమా సీతారామం.
తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఇందులో దుల్కర్ సల్మాన్, రష్మికా మందన్న, మృణాళిని ఠాకూర్, సుమంత నటించారు.
ఇక ఇందులో హీరోయిన్ పాత్ర పేరు సీత అని ఉండగా పాత్రకు తగ్గట్టుగా అందంగా చూపించారు.
"""/"/
H3 Class=subheader-styleసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: /h3p2013 లో విడుదలై మంచి హిట్ సొంతం చేసుకున్న సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.
ఇందులో వెంకటేష్, మహేశ్ బాబు, సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్, జయసుధ నటించారు.
ఇక అంజలి పాత్ర పేరు సీత అని ఉండగా తను ఆ పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించింది.
"""/"/
H3 Class=subheader-styleసుబ్రహ్మణ్యం ఫర్ సేల్: /h3p2015 లో హరీష్ శంకర్ దర్శకత్వం విడుదలైన సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.
ఇందులో సాయి ధరమ్ తేజ్, రెజీనా, ఆదా శర్మ, బ్రహ్మానందం, సుమన్ తదితరులు నటించారు.
ఇక ఇందులో రెజినా పాత్ర పేరు సీత.పాత్రకు తగ్గట్టుగా రెజీనా అద్భుతంగా నటించింది.
"""/"/
H3 Class=subheader-styleసోగ్గాడే చిన్నినాయన:/h3p 2016లో కళ్యాణ్ కృష్ణ కురసాలకు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సోగ్గాడే చిన్నినాయన.
ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించగా ఇందులో లావణ్య త్రిపాఠి పాత్ర పేరు కూడా సీతనే.
"""/"/
H3 Class=subheader-styleకంచె:/h3p జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా కంచె.ఇందులో వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ నటీనటులుగా నటించారు.
ఈ సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ పాత్ర పేరు సీత.ఈ సినిమా మాత్రం బాగా ఆకట్టుకుంది.
"""/"/
H3 Class=subheader-styleగోదావరి: /h3p2006 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన సినిమా గోదావరి.
ఇందులో సుమంత్, కమలిని ముఖర్జీ నటీనటులుగా నటించారు.ఇందులో కూడా హీరోయిన్ పాత్ర పేరు కూడా సీతనే.
అలా సీత అనే పేరుతో ఉన్న ఈ సినిమాలు అన్ని మంచి సక్సెస్ కూడా అందుకున్నాయి.