లక్షల్లో శాలరీలు వస్తున్నా జాబ్స్ వదిలేశారు.. కట్ చేస్తే సినిమాల్లో స్టార్ హీరోలు..?
TeluguStop.com
డబ్బులు ఉంటే చాలు హ్యాపీగా బతికేయవచ్చని చాలామంది అనుకుంటారు.కానీ కొందరు మాత్రం ఎంత ఆస్తులున్నా లక్షల్లో శాలరీలు వస్తున్నా సరే వారి హ్యాపీనెస్ వేరేచోట ఉంటుంది.
ఇక నటనపై మక్కువ ఉన్నవారికి సినిమాలో నటిస్తేనే జీవితంలో సంతృప్తి ఉంటుంది.లేకపోతే వారు ఏ పనీ చేయలేరు.
తెలుగులో అలాంటి ముగ్గురు హీరోలు ఉన్నారు.వారు మొదట్లో లక్షల్లో శాలరీలు సంపాదించారు.
ఒకరికి అయితే వందల్లో ఎకరాలు ఉన్నాయి.అయినా సరే వాటన్నిటినీ వదిలేసి ఇండస్ట్రీ లోకి వచ్చేసారు.
చాలా కష్టపడి స్టార్ హీరోలుగా ఎదిగారు.వారు ఎవరో తెలుసుకున్నారు.
H3 Class=subheader-style• సత్యదేవ్/h3p
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్( Satyadev ) మిస్టర్ పర్ఫెక్ట్ (2011) సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు.
తరువాత జ్యోతి లక్ష్మి (2015), క్షణం, మన ఊరి రామాయణం సినిమాల్లో కనిపించాడు.
తిమ్మరుసు: అసైన్‌మెంట్ వాలి, గాడ్సే సినిమాలతో స్టార్ హీరో అయిపోయాడు.గాడ్ ఫాదర్ సినిమాలో విలన్‌గా కూడా నటించి వావ్ అనిపించాడు.
అతనికి ఇంత సక్సెస్ రావడానికి వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి.ఈ హీరో చిన్నప్పటినుంచే యాక్టర్ కావాలనుకున్నాడు.
కానీ ఫైనాన్షియల్ కండిషన్ బాగోలేక చదువును వదిలేయలేదు.పనులు చేస్తూనే MVGR ఇంజనీరింగ్ కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు.
2016 వరకు IBM, VMware వంటి పెద్ద కంపెనీల్లో వర్చువల్ డిజైన్ ఆర్కిటెక్ట్‌గా పనిచేశాడు, అతనికి నెలకే లక్షల్లో శాలరీలు వచ్చేవి.
అయితే సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టడం కోసం హై-పేయింగ్ జాబ్స్ కూడా వదిలిపెట్టాడు.
"""/" /
H3 Class=subheader-style• నవీన్ పోలిశెట్టి/h3p
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి హిట్ సినిమాలతో నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో అయిపోయాడు.
నవీన్ చాలా టాలెంటెడ్ యాక్టర్.నటన అంటే ఇతడికి బాగా ఇష్టం.
తండ్రికి మాత్రం ఇష్టం ఉండకపోయేది కాదు.మంచిగా చదువుకొని యూఎస్‌లో సెటిల్ కావాలని తండ్రి ఎప్పుడూ మందలించేవారు.
నవీన్ తన తండ్రి కోరిక మేరకు యూఎస్ లో జాబ్ సంపాదించి లక్షల్లో శాలరీలు అందుకున్నాడు.
కానీ నటనపై మాత్రం ఇష్టం పోలేదు.ఆ ఇష్టాన్ని చంపుకోలేక ఫ్యామిలీకి తెలియకుండా ముంబైకి వచ్చి పస్తులు ఉండి స్టాండప్ కమెడియన్ గా( Standup Comedian ) ఎదిగాడు.
తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు.అనంతరం తెలుగులో అవకాశాలు రావడం వాటి ద్వారా తనని తాను నిరూపించుకున్నాడు.
హెల్తీ కామెడీతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. """/" /
H3 Class=subheader-style• కిరణ్ అబ్బవరం/h3p
ఈ యాక్టర్ అప్పట్లో నెలకి రూ.
80,000 సంపాదించేవాడు.కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఫ్యామిలీకి వందల ఎకరాలు కూడా ఉన్నాయి.
అయితే ఎంత ఆస్తి ఉన్నా కూడా అదే కాదు తన లైఫ్ అనుకున్నాడు.
నటనే తనకు సంతృప్తిని ఇస్తుందని రియలైజ్ అయ్యాడు.అందుకే అన్నిటిని వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి జంపు చేశాడు.
పుష్పలో ఆ ఒక్క సీక్వెన్స్ ఖర్చు అన్ని రూ.కోట్లా.. ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!