ఒకప్పుడు 8 ప్యాక్…ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తో టాలీవుడ్ హీరోలు
TeluguStop.com
సినిమాలో హీరోలు ఎలా ఉంటారు.? చూడడానికి ఎంతో అందంగా కుదిరితే సిక్స్ ప్యాక్( Six Pack ) మరీ కాదంటే ఎయిట్ ప్యాక్ కూడా ట్రై చేసి హాట్ గా, ఫిట్ గా కనిపిస్తూ ఉంటారు.
చూడగానే ఏమున్నాడు రా బాబు అనిపించే విధంగా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తూ ఉంటారు.
నటనకు ఎంత ప్రయారిటీ ఉంటుందో బాడీ కి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చే హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.
ఇలా సిక్స్ ప్యాక్ ట్రై చేసిన టాలీవుడ్ హీరోలలో అల్లు అర్జున్( Allu Arjun ) మొదటి వాడు.
ఆ తర్వాత అతనిని ఆదర్శంగా తీసుకుని చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్ ట్రై చేసి సక్సెస్ అయ్యారు.
ఇక టాలీవుడ్ హీరోలు కొంతమంది ఒకప్పుడు సిక్స్ ప్యాక్ చేసి ఆ తర్వాత నార్మల్ ప్యాక్ కి వచ్చేశారు.
మరికొంత మంది అయితే పొట్ట కూడా పెంచేశారు.వారు ఎవరు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
"""/" /
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్( Sunil ) మొదట్లో నార్మల్ గానే లావుగా ఉండేవాడు.
ఆ తర్వాత హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ ఈగ చిత్రం తో మొట్టమొదటిసారి తన వెయిట్ రాజమౌళి సాన పట్టడం వల్ల తగ్గిపోయాడు.
ఆ తర్వాత అప్పలరాజు( Appalaraju Movie ) సినిమాకి 6 ప్యాక్ వచ్చింది.
పూలరంగడు సినిమాతో 8 ప్యాక్ కూడా సాధించాడు.ఫాక్స్ అయితే వచ్చాయి గాని సినిమాల్లో హీరోగా సక్సెస్ మాత్రం రాలేదు.
దాంతో ప్యాక్స్ కి గుడ్ బై చెప్పిన సునీల్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.
దాంతో ఇప్పుడు అవతారం ఎత్తి బాగానే సక్సెస్ అయ్యాడు.అలా కండలు వీరుడు అయిన సునీల్ పొట్టతో కనిపిస్తున్నాడు.
"""/" /
ఈ లిస్టులో కచ్చితంగా హీరో నితిన్( Hero Nithin ) గురించి చెప్పుకోవాలి ఎందుకంటే అల్లు అర్జున్ మొదటిగా సిక్స్ ప్యాక్ చేయగానే అది ట్రై చేసినా రెండవ హీరో నితిన్.
విక్టరీ సినిమాలో( Victory Movie ) తన సిక్స్ ప్యాక్ జనాలకు చూపించి ఈ మెస్మరస్ చేశాడు.
ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు కూడా తన సిక్స్ ప్యాక్ బాగానే కనిపించింది.
కానీ ఎందుకో సినిమాల్లో విజయాలు ఎక్కువ రాకపోవడంతో ఆయన ప్రస్తుతం లైట్ వెయిట్ తో నార్మల్ పర్సనాలిటీ తోనే కనిపిస్తున్నాడు.
ఇలా ఈ హీరోలు ఒకప్పుడు సిక్స్ ప్యాక్ చేసి ప్రస్తుతం నార్మల్ లుక్ తో కనిపిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం రాబోయే సినిమాలతో అగ్ని పరీక్ష ఎదురుకోబోతున్నాడా..?