తెలుగు హీరో రిజెక్ట్ చేయడం తో ధనుష్ తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి
TeluguStop.com
ఫిబ్రవరి 17న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాతి అలియాస్ సార్ సినిమా పాజిటివ్ బజ్ తో దూసుకెళ్తోంది.
ఈ సినిమాకి తొలిసారిగా తమిళ్ లో దర్శకత్వం వహించాడు తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి.
వెంకీ అట్లూరి ఇప్పటికే తెలుగులో చాలా ఏళ్లుగా ఒక సరైన హిట్టు కోసం కష్టపడుతున్నాడు.
నటుడిగా, డైలాగ్ రైటర్ గా, రైటర్ గా, దర్శకుడిగా దాదాపుగా పదహారేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు వెంకీ.
చాలా పెద్ద బ్యానర్స్ లో సినిమాలు తీయడం వల్ల కథలో వేలు పెడతారు కాబట్టి వెంకీ అట్లూరి కాస్త నిరాశ చెందాడో ఏమో తెలియదు కానీ ఎలాంటి ఒక బ్యాగ్రౌండ్ లేని హీరోతో సినిమా తీయాలని భావించాడు.
అందుకే ఒక మంచి కథ సిద్ధం చేసుకుని మొదట మన తెలుగు హీరో అయిన నాచురల్ స్టార్ నానితో సినిమా తీయాలని అనుకున్నాడు.
"""/"/
ఆ సినిమా కథ ప్రస్తుతం ధనుష్ హీరోగా నటించిన వాతి.ఇదే సినిమా సార్ పేరుతో తెలుగు లో కూడా విడుదల అయ్యి హ్యూజ్ హిట్ దిశగా దూసుకెళ్తోంది.
అయితే ఈ కథలో పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు.హగ్ సీన్స్, ముద్దు సీన్లు అసలు ఉండవు.
కేవలం తనదైన రీతిలో పవర్ఫుల్ డైలాగ్స్ తో సినిమాని నెట్టుకొచ్చాడు వెంకి.అంతేకాదు బలమైన దర్శకత్వం కూడా ఈ సినిమా కథకు తోడవడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.
అయితే ఈ సినిమా కథను మొదట నాని రిజెక్ట్ చేశాడు అని తెలిసి ఆయన అభిమానులంతా ఫీలవుతున్నారు.
"""/"/
వెంకీ దర్శకత్వం వహించిన మొదటి మూడు సినిమాలు కూడా పెద్ద బ్యానర్స్ కావడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు వెంకి.
ఆ తర్వాత నాని లాంటి ఒక కథను నమ్ముకొని సినిమా తీసే హీరో తోనే సినిమా చేయాలనుకున్నప్పటికీ అతడు కూడా ఈ కథను రిజెక్ట్ చేశాడు.
ఈ దశలో ధనుష్ వెంకీ అట్లూరి కథకు తోడవడంతో ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది.
నాని ఈ సినిమాను రిజెక్ట్ చేయడానికి గల కారణం కథలో కొన్ని పాయింట్స్ నచ్చక పోవడమే అని తెలుస్తోంది.
అవి మార్చి కనుక తీసుకొస్తే వెంకీతో ఈ సినిమా చేయడానికి నాని సిద్ధంగా ఉన్నాడట కానీ వెంకి అందుకు ఒప్పుకోకపోవడంతో నాని ఈ చిత్రంలో నటించలేకపోయాడు.
ఇండియన్ ఫ్యామిలీపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన అమెరికన్ మహిళ.. వీడియో వైరల్..