బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చిన సౌత్ ఇండియా స్టార్ హీరోలు వీరే !

సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎవరి సపోర్ట్ దొరకకుండా చాలా ఇబ్బందులు పడుతుంటారు.

అయినా కూడా ఏదో ఒక చిన్న పాత్ర దొరక్కపోతుందా అంటూ అన్ని స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటారు.

ఇంత చేసి తీరా ఒక బాత్ అయినా దొరుకుతుందో లేదో అంటే అది అనుమానమే.

అలా కొన్ని వేలమంది ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.అయితే కొంతమంది హీరోలు మాత్రం సినిమా ఇండస్ట్రీపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేక ఎవరో ఒకరి ఇంట్రెస్ట్ వల్ల లేదా బలవంతం వల్ల సినిమాలో నటిస్తూ ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

అలా తమ ప్రమేయం లేకుండానే తమ ఇష్టం లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆ స్టార్ హీరోస్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / ఈ దిస్ లో అందరికన్నా ముందుగా చెప్పాల్సి వస్తే సూర్య( Surya ) గురించే మాట్లాడాలి.

తండ్రి శివకుమార్ సినిమాల్లో పెద్దగా ఆడక నష్టాల పాలై అప్పులు పెరిగిపోయిన సందర్భంలో తండ్రి కోసం ఇండస్ట్రీకి వచ్చాడు హీరో సూర్య.

చాలా మంచి గుడ్ లుక్స్ ఉన్న సూర్య అని హీరో చేయాలని తన తండ్రి ఎప్పటినుంచో ప్రయత్నించినా కూడా సినిమా ఇండస్ట్రీ వద్దు అని బయట ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు.

చివరికి హీరోగా నటించడం తప్పక ఇండస్ట్రీ కి వచ్చి ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

ఇదే మనసులో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి కూడా చెప్పుకోవాలి.

ఆయన ఎక్కువగా తన ప్రపంచంలో తాను ఉంటూ సినిమాల గురించి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న సమయంలో తన తల్లిదండ్రుల ప్రోత్సాహం అలాగే తోబుట్టువుల సహకారంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

"""/" / ఇక ఈ లిస్టులో ఎవరో ఊహించిన ఒక పేరు కూడా ఉంది అదే ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్.

( Prabhas ) తన తండ్రి సోదరుడైన హీరో కృష్ణంరాజు మొదటినుంచి ప్రభాస్ నీ హీరో చేయాలని అనుకున్నారు.

ప్రభాస్ అయితేనే బాగుంటుందని ప్రభాస్ కి ఇష్టం లేకపోయినా సరే సినిమా ఇండస్ట్రీకి లాక్కొచ్చారు.

అలా ముందు ఒక రీజినల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయికి ఎదిగి ఇప్పుడు ప్రపంచ స్థాయి హీరో ప్రభాస్ గా మారిపోయాడు.

ఇలా ఈ ముగ్గురు హీరోలు తమ ప్రమేయం లేకుండానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

లిస్టులో ఉన్న హీరోలంతా ఈతరం హీరోలు మాత్రమే ఇంతకన్నా ముందు ఎవరైనా మీకు తెలిసి ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.

వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలి.. ప్రముఖ నటి క్రేజీ కామెంట్స్ వైరల్!