ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు అంటూ ముగ్గురితో రొమాన్స్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు

అప్పట్లో హీరో పక్కన ఒక హీరోయిన్ మాత్రమే నటించేది.తరువాత హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు నటించడం షరా మాములు అయిపొయింది.

అయితే ఇప్పుడు ప్రస్తుతం మల్టీ హీరోయిన్ ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి.సినిమాలో హీరోకి ఉన్న డిమాండ్ ను బట్టి ఇద్దరు లేదా ముగ్గరు హీరోయిన్లతో సినిమాలకు రంగులు దిద్దుతున్నారు మేకర్స్.

యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకూ అందరూ హీరోలు కనీసం ముగ్గురు హీరోయిన్లతో ఆడి పాడ బోతున్నారు.

ఇప్పుడు ఆ ట్రెండ్ ను మన నేచురల్ స్టార్ నాని కూడా ఫాలో అవుతున్నారు.

నాని – శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం ముగ్గరు హీరోయిన్లను తీసుకోబోతున్నారు.

ఒక క్యారెక్టర్ కోసం ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి కన్ఫామ్ అయ్యింది.ఇక మెయిన్ లీడ్ రోల్‌లో సాయి పల్లవి నటించబోతోంది.

మరో గెస్ట్ హీరోయిన్ పాత్ర కోసం నివేధా పేతురాజ్, అదితీ రావ్ హైదరీలను అనుకుంటున్నారు.

అలాగే సీనియర్ హీరో బాలకృష్ణకు కూడా ఎప్పటినుంచో తన సినిమాలో ముగ్గురు హీరోయిన్ల ట్రెండ్ బాగా కలిసి వస్తుంది.

‘సమరసింహారెడ్డి’, ‘నరసింహ నాయుడు’ లో ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో ఆడిపాడారాయన ప్రస్తుతం దర్శకుడు బోయపాటితో నటిస్తున్న మూవీలో కూడా ముగ్గరు భామలను తీసుకున్నారు.

అయితే ఈ సినిమాకు ఫస్ట్ నుంచి హీరోయిన్ల ఇబ్బందులు తప్పడం లేదు.చాలా మంది పేర్లు అనుకున్నాగాని, తరువాత మరుగున పడిపోతున్నాయి.

"""/"/ మొదట్లో ఒక హీరోయిన్ గా సయేషా సైగల్ ఫిక్స్ అయినట్టు ప్రకటించిన మేకర్స్ ఆమె స్థానంలో ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నారని ప్రకటించారు.

అలాగే పూర్ణ మరో హీరోయిన్ కాగా అంజలి కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన మెయిన్ హీరోయిన్ గా ఎవరు నటిస్తారో అన్నది చూడాలి ఈ లిస్ట్ లో ఉన్న తరువాత హీరో రవితేజ.

‘క్రాక్’ సినిమాతో రిలీజ్‌కు రెడీగా ఉన్న మాస్ మహారాజా కూడా తను నెక్ట్స్ చేయబోయే ‘ఖిలాడి’ సినిమాలో ముచ్చటగా ముగ్గరు భామలతో చిందేయబోతున్నారు.

‘క్రాక్’ తరువాత రమేష్ వర్మ సినిమాలో జాయిన్ కాబోతున్నాడు రవితేజ.ఇక ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతీని హీరోయిన్స్‌గా ఫిక్స్ చేశారు.

మూడో హీరోయిన్‌గా హాట్ యాంకర్ అనసూయ నటించబోతున్నట్టు తెలుస్తోంది.వీరితోపాటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముగ్గురు హీరోయిన్స్ తో ఆడి పాడనున్నారు.

అప్పట్లో జల్సా సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్లతో నటించారు.మళ్ళీ ఇప్పుడు ‘వకీల్ సాబ్’ లో స్టోరీ డిమాండ్ ‌ను బట్టి అంజలి, నివేధా థామస్‌తో పాటు, శృతి హాసన్ కూడా నటిస్తుంది.

పవర్‌స్టార్ భార్య పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది.మన్మధుడు నాగార్జున సైతం తన నెక్స్ట్ సినిమా ‘బంగార్రాజు’ లో కూడా ముగ్గరు భామలు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇలా చాలా మంది స్టార్స్ ఇప్పుడు ముగ్గరు భామలతో డ్యూయెట్లు పాడటానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా సినిమాలు చేయడం అందరి హీరోల వల్ల అవ్వదా..?