2021లో ఒక్క సినిమా కూడా విడుదల కాని టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?

కరోనా మహమ్మారి మూలంగా సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందులు పడింది.సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి.

పూర్తయిన సినిమాలు రిలీజ్ కాలేదు.ఉపాధి లేక సినీ కార్మికులు నానా అవస్థలు పడ్డారు.

నిర్మాతలు తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేకపోయారు.మొత్తంగా కరోనా అన్ని రంగాల మాదిరిగానే సినిమా రంగాన్ని కూడా అతలాకుతలం చేసింది.

అయితే గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ కాలేదు.

కొంత మంది స్టార్ హీరోలకు 2021 జీరో రిలీజ్ ఇయర్ గా మారిపోయింది.

ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఈ ఏడాది జీరో రిలీజ్ ఇయ‌ర్ స్టార్స్ లిస్టులో పలువురు టాప్ టాలీవుడ్ స్టార్స్ ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నారు.

వీరికి సంబంధించి ఏ సినిమా కూడా ఈ ఏడాదిలో విడుదల కాలేదు.వచ్చే ఏడాది మాత్రం వీరి సినిమాలు వరుస బెట్టి విడుదల కాబోతున్నాయి.

ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్, మెగా 154 సినిమాలో చిరంజీవి బిజీగా ఉన్నాడు.స‌ర్కారు వారి పాట‌, SSMB 28తో మ‌హేశ్ బాబు రెడీ అవుతున్నాడు.

"""/" / రాధే శ్యామ్, ఆది పురుష్, స‌లార్ సినిమాలతో ప్రభాస్ జనాల ముందుకు రాబోతున్నాడు.

ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ 30తో నందమూరి హీరో ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు.లైగ‌ర్ సినిమాతో విజయ్ దేవరకొండ జనాలను 2022లో పలకరించబోతున్నాడు.

"""/" / తెలుగు సినిమా పరిశ్రమలో భారీ అంచనాల నడుమ ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి.

అయితే ఈ సినిమాలతో తెలుగు జనాలను బాగా ఆకట్టుకుంటారేమో చూడాలి.లేదంటే కరోనా తర్వాత కూడా వీరి మీద గట్టి దెబ్బే పడింది అని చెప్పుకోవచ్చు.

ఎనీవే వీరందరికీ ఆల్ ది బెస్ట్ మాత్రం చెప్తాం.

ఓరినాయనో, ఒక్క సంవత్సరంలోనే రూ.367 కోట్లు సంపాదించిన అడల్ట్ స్టార్.. ఈమె స్టోరీ వింటే..?