తమిళ్ లో ఒక్క తెలుగు హీరో ఎందుకు పాపులర్ కాలేకపోతున్నారు ?
TeluguStop.com
మన తెలుగు వాళ్ళ మంచి తనమో, చేత కానీ తనమో తెలియదు కానీ ఎవరు ఏ సినిమా తెచ్చిన చూస్తాము, ఎలాంటి సినిమా అయినా మన తెలుగు లో ఈజీ గా డబ్బింగ్ చేసుకోగలరు.
కన్నడ నుంచి ఎవరు వచ్చిన, తమిళం నుంచి ఎలాంటి చెత్త తెచ్చిన ఆదరించడానికి మనం ఎప్పుడు సిద్దమే.
ఇక వచ్చిన ఆ సినిమా కాస్తో కూస్తో బాగుంటే ఇక సినిమాకు తిరుగుండదు.
వాళ్ళ ఓన్ భాషలో కన్నా కూడా మన భాషలో కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి.
టాలీవుడ్ లో చాల మంది పంపిణి దారులు సైతం ఇక్కడ మార్కెట్ ని దృష్టి లో పెట్టుకొని పర బాషా చిత్రాలను తక్కువ రేటుకి కొని తెలుగు లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ ఉంటారు.
ఇందులో మరి ముఖ్యం గా తమిళం నుంచి దాదాపు డజన్ మంది హీరోలు వారి ప్రతి సినిమాను తెలుగు లో విడుదల చేయడం ఆనవాయితీ గా మారిపోయింది.
విజయ్, అజిత్, విజయ్ సేతుపతి, కమల్, విక్రమ్, రజిని, సూర్య, కార్తీ, ఆర్య, శివ కార్తికేయన్ వంటి హీరోలు చాలానే తెలుగు లో ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు.
"""/"/
కానీ మన తెలుగు హీరోలు ఎవ్వరు కూడా తమిళ్ లో అంతగా గుర్తింపు కు నోచుకోవడం లేదు.
కారణం ఏంటో తెలియదు కానీ తమిళ్ వాళ్ళు ఇంకో బాషా హీరో వస్తే ఎప్పుడు అవుట్ సైడర్ గానే చూస్తారు.
అక్కడ ప్రేక్షకులు పర బాషా హీరోలను ఎంకరేజ్ చేయరు.ఒక్క తెలుగు వారు మాత్రమే కాదు కన్నడ సినిమాలు కూడా అక్కడ చూసే దిక్కు ఉండదు.
ప్రపంచం మొత్తం దున్నిన కాంతారా చిత్రం తమిళ్ లో కేవలం 12 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించిందంటే మనం అర్ధం చేసుకోవచ్చు.
"""/"/
తమిళ్ వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో.అల్లు అర్జున్ లాంటి హీరో కేరళ లో ఒక స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు కానీ మారె హీరో కి అది సాధ్యం కాలేదు.
ఇప్పుడు విడుదల అవుతున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా అంటూ ఊదర గొట్టుకుంటున్నాం కానీ అవి ప్రత్యేకించి తమిళ్ లో ఎంత వసూళ్లు సాధిస్తున్నాయని చూస్తే మాత్రం నామ మాత్రపు వసూళ్లే.
ఇక నైనా మన తెలుగు ప్రేక్షకులు లేదా తెలుగు సినిమాల పంపిణి దారులు ఈ విషయాన్నీ బాగా గమనిస్తే మంచిది.
అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా… బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్!