హిట్టు కోసం పాట్లు పడుతున్న హీరోలు..ఆశలన్నీ వాటిపైనే !

అర్జెంటుగా మాకు ఒక హిట్టు కావాలి.లేదంటే ఇక మమ్మల్ని ఇండస్ట్రీ మరిచిపోతుంది అంటున్నారు.

ఈ కుర్ర హీరోలంతా.ఎందుకంటే వీరెవరికి ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టు కూడా పడలేదు.

విజయాలేమో వీరిని పలకరించడం లేదు.వీరు తీసుకుంటున్న స్టోరీస్ అలాగే ఎంచుకుంటున్న దర్శకులు అందరూ కూడా మంచివారే.

ఆయన అదృష్టం కాసింత కూడా కలిసి రాకుండా వీరిని ఎప్పుడూ పరాజయం వైపు నిలబెడుతోంది.

మరి ఈసారైనా ఎలాగోలా విజయాన్ని దక్కించుకోవాలని అనేక పాట్లు పడుతున్నారు.షూటింగ్లో చెమటలు కక్కుతున్నారు.

అయితే వీరికి హిట్టు దక్కాలంటే మరి కొంతకాలం ఎదురు చూడాలి.ఎలాగోలా 2024 లో హిట్టు కొట్టాలని కసి మీద ఉన్న హీరోలు ఎవరో ఒక్కసారి లుక్కేద్దాం.

"""/" / చాలా ఏళ్లుగా ఒక హిట్టు కోసం ఎదురుచూస్తున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం గోపిచంద్( Gopichand ) మాత్రమే.

నిజం చెప్పాలంటే ఒక దశాబ్దానికి పైగా ఆయనకు విజయమే లేదు.అయినప్పటికీ అతడిలో ఇంకా నమ్మకాన్ని పెట్టుకుని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వం అనే కొత్త సినిమాకి శ్రీకారం చుట్టింది.

శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకుడు.మరి ఈ ఇద్దరు పరాజయాల్లోనే ఉన్నారు.

మరి విశ్వం సినిమాతో ఏమాత్రం విజయాన్ని దక్కించుకుంటారో చూడాలి.ఎక్స్ట్రాడరీ మ్యాన్ అంటూ వచ్చి ఆర్డినరీగా కూడా విజయాన్ని అందుకోలేకపోయాడు నితిన్( Nithiin ).

అందుకే ఈసారి ఎలాగైనా 2024లో విజయాన్ని దక్కించుకునే ఈ ఏడాది పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు.

నితిన్ ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ అనే సినిమాలను చేస్తున్నాడు.మరి ఇవి ఏమైనాకు ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.

"""/" / ఒకే ఒక జీవితం( Oke Oka Jeevitham ) తర్వాత మంచి విజయాలు అందుకుంటాడు అనుకున్నా కూడా మళ్ళీ లాంగ్ గ్యాప్ వచ్చేసింది శర్వానంద్( Sharwanand ) కి.

అందుకే ఈసారి ఏకంగా మూడు కథలను ఓకే చేసి అన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

అందులో రెండు సినిమాలు అయినా 2024లో విడుదల చేసి విజయాలను అందుకోవాలని తహతలాడుతున్నాడు.

మరి ఏ మాత్రం శర్వా కల నెరవేరుతుందో చూడాలి.ఇస్మార్ట్ శంకర్ తర్వాత మంచి హిట్టు లేదు రామ్ పోతినేనికి.

అలాగే పూరి జగన్నాథ్ సైతం పరాజయాల్లోనే కొట్టు మెటాడుతున్నాడు.వీరిద్దరూ కలిసి ఇప్పుడు డబల్ స్మార్ట్ ( Double ISmart )అంటూ రాబోతున్నారు.

మరి ఈ ఇద్దరికీ ఒక విజయం ఖచ్చితంగా కావాలి.ఏ మేరకు అది నెరవేరుతుందో తెలియాలి అంటే ఈ ఏడాది చివరి వరకు ఎదురు చూడాలి.

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..!!