చిన్న హీరోల దగ్గర నుంచి బడా హీరోలు వరకు.. జిమ్ లో తెగ కష్టపడుతున్నారుగా?

ఒకప్పుడు హీరోలకు బాడీ బిల్డింగ్ తో.సిక్స్ ప్యాక్ లతో అసలు సంబంధమే ఉండేది కాదు.

కానీ నేటి రోజుల్లో హీరోలకు మాత్రం ఆ కష్టాలు వచ్చేసేయ్.ఇప్పటి కాలంలో సిక్స్ ప్యాక్ లేదంటే ప్రేక్షకులు అస్సలు ఒప్పుకోవడం లేదు.

ఇక హీరోలు కూడా తన అభిమానుల కోసం కసరత్తులు చేసి బాడీ పెంచుతూ సిక్స్ ప్యాక్ లతో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

కొంతమంది పాత్రల కోసం సిక్స్ ప్యాక్ లు చేస్తుంటే మరికొంతమంది అభిమానుల కోసం సిక్స్ ప్యాక్ పెంచుతూ ఉన్నారు.

మరి ఇలా సినిమాల కోసం బాడీ పంచుతున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ తో కనిపించి అందరికీ కూడా సర్ప్రైస్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు భారీగానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

శంకర్ సినిమాలో మూడు వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడు చరణ్.కాగా పాత్రల కోసం బాడీని పెంచుతూ తగ్గిస్తూ క్యారెక్టర్ కు అనుకూలంగా మారిపోతున్నాడు.

ఇటీవలే జిమ్ లో కష్టపడుతున్న వీడియో ని కూడా పోస్ట్ చేశాడు అనే విషయం తెలిసిందే.

రాధేశ్యాం సినిమా కోసం బాడీ బిల్డింగ్ వదిలేసి కాస్త బొద్దుగా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కే, సలార్, ఆది పురుష్ సినిమాల కోసం మళ్లీ వర్కౌట్ మొదలుపెట్టి బాడీ తగ్గించి హ్యాండ్సమ్ లుక్ లోకి వచ్చేశాడు.

ఇక పుష్ప 2 కోసం అల్లు అర్జున్ కూడా తన పాత్రలో మరింత పవర్ ఫుల్ గా కనిపించేందుకు బాడీ ఫిట్నెస్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

త్రిబుల్ ఆర్ సినిమా లో తన బాడీ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన జూనియర్ ఎన్టీఆర్ ఇక ఇప్పుడు కొరటాల శివ తో సినిమా కోసం మరింత కసరత్తు ప్రారంభించాడట.

"""/"/ ఇప్పటి వరకు అసలు సిక్స్ ప్యాక్ ల జోలికి వెళ్లని విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో మాత్రం సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించాడు.

ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఇక నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా కోసం వివిధ వేరియేషన్స్ లో నటించాడు.

ఈ క్రమంలోనే ఇక బాడీ ని తగ్గించి పెంచడానికి చాలానే కష్టపడ్డాడు.ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ సైతం తన బాడీ పెంచి బీస్ట్ లా మారిపోయాడు.

ఏజెంట్ తో సర్ప్రైస్ చేయబోతున్నాడు.ఇక ఎంతో మంది యువ హీరోలు కూడా ఇలా బాడీ ఫిట్నెస్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నాగశౌర్య, సందీప్ కిషన్ లాంటివాళ్ళు సిక్స్ ప్యాక్ తో కనిపించారు.

మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో…