రిపీట్ మోడ్ లో టాలీవుడ్ హీరోలు.. మళ్లీ హిట్ కొడతారా?

మొన్నటి వరకు స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకూ ప్రతి ఒక్కరూ కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు.

కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలందరూ ఇప్పటికే తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు అన్నది తెలుస్తోంది.

హిట్ ఇచ్చిన దర్శకుడుతోనే సినిమా తీసి మరో సారి సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు.

ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleపవన్ కళ్యాణ్ : /h3pపవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్ ఒక ప్రత్యేకమైన సినిమా.

అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్.ఇక తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో మరో సినిమాకు రెడీ అయ్యాడు పవన్ కళ్యాణ్.

భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

"""/" / H3 Class=subheader-styleమహేష్ బాబు : /h3pమహేష్ బాబు కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రాలు గా నిలిచిన అతడు, ఖలేజ అలాంటి సినిమాలు తీసిన దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ముచ్చటగా మూడో సారి కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు సూపర్ స్టార్.

ఇక త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. """/" / H3 Class=subheader-styleజూనియర్ ఎన్టీఆర్ :/h3p ఇటీవలే రాజమౌళితో త్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్.

తనకు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో మరోసారి సినిమాకు రెడీ అయ్యాడు.

ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.వీరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది.

"""/" / H3 Class=subheader-styleఅల్లు అర్జున్ :/h3p అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ ఇప్పటివరకూ ఆర్య, ఆర్య 2, పుష్ప సినిమాలతో ముచ్చటగా మూడుసార్లు రిపీట్ అయి హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది.

ఇప్పుడు సుక్కు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 కోసం అల్లు అర్జున్ సిద్దమౌతున్నాడు.

కాగా ఇలా హిట్ ఇచ్చిన దర్శకులతో సినిమా చేస్తున్నారు.మరి మళ్ళీ హిట్ కొడతాడో లేదో చూడాలి.