ప్యాన్ ఇండియా సినిమా బడ్జెట్ పెరిగితే హీరోల జుట్టు పొడుగు అవ్వాల్సిందేనా ?
TeluguStop.com
సినిమాల మీద సినిమాలు ఒకే సిరీస్ పైన తీస్తున్నవా హీరోలు సేమ్ లుక్ కంటిన్యూ చేయాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఏళ్లకు ఏళ్ళు ఇలా చాలా పొడవాటి జుట్టుతో గడ్డంతో ప్రేక్షకుల ముందు కనిపించాడు హీరో యష్( Yash ) .
పొడుగు జుట్టు ఎక్కువ రోజులు మైంటైన్ చేసిన అవార్డు ఏదైనా ఇవ్వాల్సి వస్తే అది యష్ లాంటి హీరోకే ఇవ్వాలి.
కే జి ఎఫ్ 2 వరకు జుట్టు చాలా రోజులు పెంచి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు పార్ట్ త్రి కోసం మళ్లీ పెంచి ఏళ్లకు ఏళ్ళు ఇదే లుక్కులో ఉండబోతున్నాడు.
పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అంటే బడ్జెట్ పెరగడంతో పాటు బడ్జెట్ పెరిగిన ప్రతిసారి హీరోల జుట్టు కూడా పెరుగుతుంది.
ఇది ఆనవాయితీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. """/" /
తాజాగా కల్కి( Kalki ) ఈ సినిమా ప్రమోషన్ సాంగ్ అంటూ ప్రభాస్( Prabhas ) పొడవాటి హెయిర్ స్టైల్ తో బాగా పెంచేసి అద్భుతంగా కనిపించాడు.
ఈ లుక్కుతో కల్కి సినిమాపై ఓ అంచనా వచ్చింది.ఇక మహేష్ బాబు రాజమౌళి తో పాన్ ఇండియా సినిమా తీస్తున్న విషయం మన అందరికి తెలిసిందే.
ఈ సినిమాలో లుక్కు కోసం చాలా రోజులుగా హైడ్ చేసిన మహేష్( Mahesh ) హెయిర్ స్టైల్ ఎంతో బ్యూటిఫుల్ గా పొడవుగా తాజాగా సన్రైజర్స్ టీం తో ఫోటోలు దిగడంతో బయటపడింది.
ఈ లుక్ కి టాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయారు.ఇక అనిమల్ సినిమాలో సైతం రణబీర్ కపూర్ పొడవాటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేశాడు దానితోపాటు మరో భాగం కూడా రానున్న నేపథ్యంలో అదే హెయిర్ స్టైల్ కంటిన్యూ అవుతోంది.
పైగా నార్త్ రామాయణం కోసం రణబీర్ కపూర్ ( Ranbir Kapoor )పొడవాటి జుట్టు నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.
"""/" /
ఇక ఇటీవల ద గోట్ లైఫ్ సినిమా కోసం పృథ్వి( Pruthvi ) చాలా లాంగ్ హెయిర్ స్టైల్ తో కనిపించాడు.
పుష్పరాజ్ సైతం పార్ట్ వన్ తో పాటు 2 కోసం కూడా పొడవు జుట్టునే బన్నీ మైంటైన్ చేస్తూ వస్తున్నాడు.
ఇక సూర్య( Surya ) మొట్టమొదటి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆయన కంగువా సినిమా కోసం లాంగ్ హెయిర్ తోనే చాలా రోజులుగా షూటింగ్ చేస్తున్నాడు అలాగే తంగలాన్ సినిమా కోసం విక్రమ్ ( Vikram ) చాలా ఏళ్లుగా హెయిర్ స్టైల్ పొడవు గానే ఉంచి షూటింగ్ చేస్తున్నాడు.
ఇలా పాన్ ఇండియా సినిమా తీయాలి అంటే భారీ బడ్జెట్ తో పాటు భారీగా జుట్టు కూడా మెయింటైన్ చేయాలి అని తాజాగా మన హీరోలు తీస్తున్న సినిమాలను చూస్తే అర్థమవుతుంది.
భారత సంతతి వ్యక్తికి కీలక పదవి .. ట్రంప్ ప్రకటన, ఎవరీ జై భట్టాచార్య?