ఇండస్ట్రీకి వారసులను పరిచయం చేసిన నిర్మాతలు ఎవరో తెలుసా?
TeluguStop.com
వారసత్వం అనేది ప్రతీరంగంలో కొనసాగుతూనే ఉంది.నాటి నుంచి నేటి వరకు ఈ సంప్రదాయం కొనసాగుతుంది.
ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది.ప్రస్తుతం సినిమా రంగం కూడా వారసత్వంతో నిండిపోయింది.
ఒక్కరు సినిమా రంగంలోకి వచ్చి క్లిక్ అయితే చాలు.ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వచ్చి చేరుతున్నారు.
ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతల వారసులు తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టారు.
అయితే చాలా మంది నట వారసులను పలువురు నిర్మాతలు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleపవన్ కల్యాణ్/h3p
అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కల్యాణ్ పరిచయం అయ్యారు.
ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.h3 Class=subheader-styleమహేశ్/h3p """/"/
1999లో రాజకుమారుడు సినిమాతో కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ బ్యానర్లో కె.రాఘవేంద్రరావు తెరకెక్కించాడు.
H3 Class=subheader-styleజూ.ఎన్టీఆర్/h3p """/"/
హరికృష్ణ నటవారసుడిగా 2001లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో రామోజీరావు నిర్మాతగా నిన్ను చూడాలని సినిమాతో పరిచయం అయ్యాడు.
ఈ ససినిమాకు వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు.h3 Class=subheader-styleప్రభాస్/h3p """/"/
2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ పరిచయం అయ్యాడు.
నటుడు అశోక్ కుమార్ నిర్మాతగా డైరక్టర్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.
H3 Class=subheader-styleఅల్లు అర్జున్/h3p """/"/
2003లలో గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
యునైటెడ్ ప్రొడ్యూసర్స్ బ్యానర్ పై అశ్వనీదత్, అల్లు అరవింద్ కలిసి ఈ సినిమా నిర్మించారు.
H3 Class=subheader-styleరామ్ చరణ్/h3p """/"/
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా 2009లో చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.
వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మాతగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.
H3 Class=subheader-styleనాగచైతన్య-అఖిల్/h3p """/"/
నాగ చైతన్య జోష సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఈ సినిమాకు ను దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా వాసు దర్శకత్వం వహించారు.
అఖిల్ ను హీరో నితిన్ నిర్మాతగా వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
అమెరికా వీధుల్లో మత్తులో ఊగిన భారతీయ మహిళ.. నల్లజాతి మహిళను ఏమందో తెలుసా?