ఈ తరం లో తారక్ మాత్రమే చేసిన ఆ దమ్మున్న పనేంటో తెలుసా ?
TeluguStop.com
టాలీవుడ్ లో నాటి తరం నుంచి నేటి వరకు డబల్ రోల్ లేదా ట్రిపుల్ రోల్ లో నటించడం సర్వసాధారణమే.
అయితే ఇలా హీరోలు ఒకే సినిమాలో బహుముఖ పాత్రలో నటించడం అనేది ఒకప్పుడు చాలా పెద్ద విషయం అంతేకాదు వింతైన విషయం కూడా.
ఎన్టీఆర్ లాంటి సీనియర్ నటుడు దానవీరశూరకర్ణ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో నటించాడు.
అలా నటించడం వల్ల సినిమాను ఎక్కువగా జనాల్లో ప్రమోషన్ చేసుకోవచ్చు అనే కారణంతో అలాగే ఎక్కువగా సదర్ హీరో సినిమాలో కనిపించడం వల్ల అభిమానులు బాగా త్రిల్ ఫీల్ అవుతారు అని అనుకునేవారు.
అయితే ఇలా నటించడం రాను రాను తగ్గుతూ వస్తోంది.ఇక లోకనాయకుడు కమల్ హాసన్ మాత్రమే విచిత్ర సహోదరులు సినిమాలో డబల్ డోర్ మైకేల్ మదన కామరాజు సినిమాలో ట్రిపుల్ రోల్ దశావతారం సినిమాలో పది పాత్రల్లో నటించాడు.
ఇలా చేయడం మరే నటుడికి సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఒకటికి మించి ఎక్కువ పాత్రలో హీరోలు నటిస్తే ఆర్టిఫిషియల్ గా ఫీల్ అవుతున్నారు.
కేవలం అవసరాన్ని బట్టి ద్వంద పాత్రలకు ఓకే చెబుతున్నారు కానీ ట్రిపుల్ రోల్ చేయడం అనేది కత్తి మీద సామ చేయడం లాంటిదే.
"""/"/
అలా మూడు లేదా అంతకుమించి పాత్రల్లో నటించాలంటే అంతకుమించి బలమైన కథ కూడా ఉండాలి.
ఆ కథను అద్భుతమైన కథనంతో ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న దర్శకులు ఉండాలి.
అంతటి అభిరుచి ఉన్న నిర్మాతలు కూడా ముందుకు రావాలి.ఇవన్నీ జరగడం ఇప్పుడు దాదాపు అసాధ్యమే.
ఇక చిరంజీవి కూడా ముగ్గురు మొనగాళ్లు అనే పేరుతో ఒక సినిమా తీయగా దాని పరిస్థితి ఏంటో మనకు తెలిసిందే.
"""/"/
ఇక ఇటీవల కాలంలో తారక్ మాత్రమే జై లవకుశ సినిమాలో మూడు పాత్రలు పోషించి జనాల్ని అలరించాడు.
ఇక రానున్న రోజుల్లో డబల్ రోల్ చేయడం కూడా చాలా కష్టమైన పరిస్థితులే ఉన్నాయి చాలా తక్కువ సినిమాల్లో ఇప్పుడు డబల్ రోల్ ఉన్న పాత్రలు ధరిస్తున్నారు హీరోలు.
ఇక ఇటీవల వచ్చిన ధమాకా సినిమాలో సైతం రవితేజ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు.
శంకర్ నిర్మిస్తున్న రామ్ చరణ్ సినిమా సైతం హీరో డ్యూయల్ రోల్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలి.. ప్రముఖ నటి క్రేజీ కామెంట్స్ వైరల్!