ఒకే రోజు.. ఒకే హీరో.. రెండు సినిమాలు విడుదల..
TeluguStop.com
బేసిక్ గా మన హీరోలు సీజన్ చూసుకుని ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తారు.
ఈ కరోనా దెబ్బకు ఏడాదికి ఒకసారి కనిపించే స్టార్స్ ని ఇంకా ఎప్పుడు చూస్తామో అనిపించేలా పరిస్థితి నెలకొంది.
కానీ ఒకప్పుడు అన్ని బాగున్న సందర్భంలో ఒకే హీరో నటించి రెండు సినిమాలు సైంతం ఒకే రోజు విడుదల అయిన రోజులున్నాయి.
వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ముమ్మాటికీ నిజం.నాటి ఎన్టీఆర్ నుంచి నేటి నాని వరకు ఈ ట్రెండ్ కొనసాగింది.
ఇంతకీ ఒకే రోజు విడుదల అయిన ఒకే హీరో రెండు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
H3 Class=subheader-styleఎన్టీఆర్/h3p
జనవరి 14, 1959లో అప్పు చేసి పప్పు కూడా, సంపూర్ణ రామాయణం సినిమాలు విడుదల అయ్యాయి.
అటు మే 5, 1961లో కూడా ఎన్టీఆర్ హీరోగా చేసిన పెండ్లి పిలుపు, సతీ సులోచన సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి.
H3 Class=subheader-styleశోభన్ బాబు/h3p """/"/
టాలీవుడ్ అందగాడు నటించిన లక్మీ నివాసం, పంతాలు పట్టింపులు సినిమాలు జులై 19, 1968లో విడుదల అయ్యాయి.
H3 Class=subheader-styleచిరంజీవి/h3p """/"/
ఈయన నటించిన కాళి, తాతయ్య ప్రేమ లీలలు సినిమాలు సెప్టెంబర్ 19, 1980లో విడుదల అయ్యాయి.
అటు అక్టోబర్ 1, 1982లో పట్నం వచ్చిన పతివ్రతలు, టింగు రంగడు సినిమాలు సైతం రిలీజ్ అయ్యాయి.
H3 Class=subheader-styleక్రిష్ణ/h3p """/"/
సూపర్ స్టార్ క్రిష్ణ నటించిన ఇద్దరు దొంగలు, యుధ్ధం సినిమాలు సైతం ఒకే రోజున విడుదల అయ్యాయి.
జనవరి 14, 1984లో ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి.h3 Class=subheader-styleబాలక్రిష్ణ/h3p """/"/
నట సింహం బాలక్రిష్ణ నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు సెప్టెంబర్ 3, 1993 రోజున విడుదల అయ్యాయి.
H3 Class=subheader-styleనాని/h3p """/"/
నేచురల్ స్టార్ నాని నటించిన జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రమణ్యం సినిమాలు కూడా ఒకే రోజు విడుదల అయ్యాయి.
ఈ రెండు సినిమాలు మార్చి 21, 2015లో రిలీజ్ అయ్యాయి.
గురుద్వారాలో ఘర్షణ .. బెల్జియంలో భారత సంతతి సిక్కు మృతి