సాయి పల్లవి నుంచి శ్రీ లీల వరకు డ్యాన్స్ తో ఇరగదీసిన హీరోయిన్స్ వీళ్ళే!

ఒక సినిమాలో హీరోయిన్ అంటే కేవలం ఆటపాట కోసమే అన్నట్టుగా వాడుతుంటారు కొంతమంది దర్శకులు.

కానీ ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.హీరో పాత్రతో సమానంగా తాము కూడా సినిమాలు నిలబెట్టగలం అంటూ ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు.

అయితే కొన్నిసార్లు నటన కన్నా కూడా తమ డాన్స్ తో ప్రేక్షకులను సంపాదించుకున్న హీరోయిన్స్ కూడా లేకపోలేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది నటనతో పాటు డాన్స్లను కూడా ఇరగదీసి తమ పక్కన నటించే హీరోలు తేలిపోయేలా చేశారు.

మరి అలా డాన్స్ తోనే గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది హీరోయిన్స్( Heroines ) గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇటీవల కాలంలో డాన్సులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది శ్రీలీల( Srileela ).

ఈ అమ్మడు డాన్స్ తో కుర్ర కారుని గిలిగింతలు పెట్టింది.అయితే కేవలం డ్యాన్ ల కోసమే శ్రీలీల అనేలా కొంతమంది దర్శకులు ఆమెకు సరైన పాత్రలు రాయకపోవడంతో కెరియర్ అటు ఇటుగా కొనసాగుతుంది.

కానీ శ్రీలీల మాత్రం ఒక మంచి డాన్సర్ అని ఒప్పుకోక తప్పదు.ఇక సాయి పల్లవి( Sai Pallavi ) నృత్యం చేస్తుంటే పురి విప్పిన నెమలిలా కనిపిస్తుంది.

ఆమె తన డాన్స్ తో వయ్యారం తో ప్రేక్షకుల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

ఆమె నటిస్తుంది అంటే ఆ సినిమాలో ఖచ్ఒఛితంగా ఒకటి రెండు మంచి డ్యాన్స్ నెంబర్స్ ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.

"""/" / కాస్త వెనక్కి వెళితే తమన్నా( Tamannaah ) కూడా మంచి డాన్సర్ అని కొన్ని సందర్భాల్లో నిరూపించుకుంది.

రామ్ చరణ్ తో వాన వాన పాటలో ఆమె హోయలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.

"""/" / ఇక భానుప్రియ( Bhanupriya ) ట్రెడిషనల్ డాన్సర్ కావడంతో ఆమెకు చాలా మంచి పట్టు ఉంది డాన్సులపై.

ఆమె డాన్సర్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది.చిన్నతనం నుంచి ఆమె డాన్స్ నేర్చుకోవడం పట్ల ఆసక్తి ఉండడంతో సినిమాల్లో కూడా ఆమెకు మంచి పాటలు వచ్చాయి.

""img Src=" " / రాధ ( Radha ) లాంటి సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా అప్పట్లో చాలా చురుగ్గా డాన్స్ చేసేవాళ్ళు.

ఆమె పక్కన చిరంజీవి లాంటి ఒక గొప్ప డాన్సర్ కూడా స్టెప్పు వెయ్యాలంటే భయపడేవారు.

అంతలా రాధా తన గ్రేస్ డ్యాన్స్ తో హీరోలను భయపెట్టింది. """/" / 90's లో సిమ్రాన్( Simran ) కూడా జీరో సైజ్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేసేది.

ఆమె కమర్షియల్ సాంగ్స్ లలో ఆడి పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లపై డైరెక్టర్ ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్లు.. అలాంటి కామెంట్స్ చేస్తూ?