ఈ మధ్యకాలంలో కుర్రాళ్ల మనసు దోచేసిన టాలీవుడ్ హీరోయిన్స్ వీరే.!
TeluguStop.com
హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన చాలామందికి కి ఒక 5,6 సినిమాలు తీసిన తర్వాత మంచి గుర్తింపు వస్తుంది కానీ ఈ తరం హీరోయిన్లలో చాలామంది వాళ్లు నటించిన ఫస్ట్ సినిమాతోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు కొందరు వాళ్ల అందంతో ఆడియన్స్ కి చెమటలు పట్టిస్తుంటే మరికొందరు వాళ్ల నటనతో ఆడియన్స్ నీ ఆకట్టుకుంటున్నారు.
అలా మొదటి సినిమాతో తెలుగు చలనచిత్ర సీమకి పరిచయమైన హీరోయిన్ లలో వాళ్ల మొదటి సినిమాతోనే జనాలలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం
H3 Class=subheader-styleదివ్యాంశ కౌశిక్/h3p """/"/
తన పేరు చెప్తే చాలామందికి గుర్తు ఉండకపోవచ్చు కానీ నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్లో వచ్చిన మజిలీ సినిమాలో నాగ చైతన్య లవర్ గా నటించిన అమ్మాయి గురించి మాత్రం అందరికీ తెలుసు ఆ అమ్మాయినే దివ్యాంశ కౌశిక్ మజిలీ సినిమాలో నాగచైతన్య, సమంత లాంటి సీనియర్ హీరో హీరోయిన్స్ మధ్య కొత్తగా వచ్చిన హీరోయిన్ అయిన దివ్యాంశ కౌశిక్ తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరే కొట్టేసిందని చెప్పొచ్చు.
ఈమె ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది.h3 Class=subheader-styleశ్రద్ధా శ్రీనాథ్/h3p """/"/
ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే జెర్సీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆమె యాక్టింగ్ నచ్చకుండా ఉండదు.
ఇద్దరు కలిసి లవ్ మ్యారేజ్ చేసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఏలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి అనేది చాలా మందికి తెలీదు కానీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం బాగా అర్థం అవుతుంది.
ఎందుకంటే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి సమాజంలో మనం ఎవరి కంటే తక్కువ కాదు అని మనం కూడా ఒక మంచి లైఫ్ ని లీడ్ చేస్తూ సమాజం లో మనం అందరితో ఒక మంచి ఫ్యామిలీ అని అనిపించుకోవాలి అనుకునే క్యారెక్టర్ లో ఒక ఫ్యామిలీ ఉమెన్ గా చాలా చక్కగా నటించి మెప్పించారు.
శ్రద్ధా శ్రీనాథ్ కి తెలుగులో జెర్సీ ఫస్ట్ సినిమా అయినప్పటికీ తమిళంలో తాను అప్పటికే విక్రమ్ వేద సినిమాలో నటించింది.
H3 Class=subheader-styleకృతి శెట్టి/h3p """/"/
ఈమధ్య మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా మేనల్లుడు అయిన వైష్ణవి తేజ్ హీరోగా కొత్త దర్శకుడు అయిన బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
ఆ పాత్రలో తను నటించడమే కాదు జీవించింది అనే చెప్పాలి.కృతి శెట్టి సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత నుంచే చాలా పాపులర్ అయింది సినిమా రిలీజ్ కాకముందే తనకి ఇంకో సినిమా చేసే అవకాశం వచ్చింది చక్కనైన అందంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ ఈ మధ్య కాలంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కృతి శెట్టినే.
అయితే ప్రస్తుతం ఆ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ తో రన్ అవుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.
ఉప్పెన సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఆ సినిమాపై జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి.
ఎందుకంటే సినిమా టీజర్ రిలీజ్ చేశారు కానీ సినిమా టీజర్ ని ఎక్కువ మంది చూడడానికి కారణం మాత్రం కృతి శెట్టినే సినిమా మంచి హిట్ అవడంతో ఇప్పుడు పెద్ద హీరోల నుంచి కూడా మంచి చాన్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleకళ్యాణి ప్రియదర్శిని/h3p """/"/
అఖిల్ హీరోగా విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్లో వచ్చిన హలో సినిమాలో హీరోయిన్ గా నటించింది కళ్యాణి ప్రియదర్శన్ తనకు ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా మంచి అభినయంతో, అందంతో జనాలని ఆకట్టుకుంది ఈ సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో వచ్చిన చిత్రలహరి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది ఈ సినిమా విజయవంతం కావడంతో తనకి కూడా ఇప్పుడు ఇంకా మంచి ఛాన్స్ లు వస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?