18 ఏండ్లు నిండక ముందే వెండితెరకు పరిచయమైన హీరోయిన్లు వీరే..

సినిమా కేరీర్ హీరోలతో పోల్చితే హీరోయిన్లకు చాలా తక్కువ ఉంటుంది.ఈ రోజుల్లో అయితే మరీ తక్కువ.

గతంలో రెండు మూడు దశాబ్దాల పాటు హీరోయిన్లుగా చలామణి అయ్యేవారు కొంత మంది నటీమణులు.

ఇప్పుడు పట్టుమని పది సినిమాలు చేయకముందే ఫేడౌట్ అవుతున్నారు.అయితే పలువురు హీరోయిన్లు సినిమా పరిశ్రమలోకి తక్కువ వయసున్నప్పుడే వస్తున్నారు.

40 ఏండ్లు వచ్చే సరికే పెట్టేబేడా సర్దుకుంటున్నారు.అయితే చిన్నవయసులో పరిశ్రమలో అడుగు పెట్టి సత్తా చాటిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అతిలోక సుందరి శ్రీదేవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.ఈమె కేవలం 13 ఏండ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చింది.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది.కోలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా తన స్టార్ డమ్ ను కొనసాగించింది.

తాజాగా గోల్డెన్ లెగ్ గా గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి కూడా చిన్న వయసులోనే సినిమా పరిశ్రమలోకి వచ్చింది.

ఆమె 17 ఏండ్లకే  సినిమాల్లోకి  అడుగు పెట్టింది.తొలుత మోడలింగ్ చేసిన ఆమె.

ఉప్పెనతో వెండి తెరకు పరిచయం అయ్యింది. """/" / చార్మి కూడా 15 ఏండ్లకే హీరోయిన్ అయ్యింది.

2002లో విడుదలై నీతోడు కావాలి సినిమాతో ఆమె జనాల ముందుకు వచ్చింది.తమన్నా కూడా 15 ఏండ్లకే హీరోయిన్ గా మారింది.

తను నటించిన తొలి సినిమా చాంద్ సా రోషన్ చెహ్రా.2005లో రిలీజ్ అయ్యింది.

"""/" / హన్సిక కూడా కేవలం 16 ఏండ్లకే  సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా వచ్చింది.

2007 వచ్చిన దేశముదురు సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.శ్వేతా బసు ప్రసాద్ 2008లో వచ్చిన కొత్త బంగారులోకం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

అప్పుడు తన వయసు 17 ఏండ్లు. """/" / అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన క్యూట్ బ్యూటీ సయేశా సైగల్.

అప్పుడు ఈమె వయసు 17 ఏండ్లు మాత్రమే.ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అవికా గోర్.

2013లో వచ్చిన ఈ సినిమా నాటికి తన వయసు కేవలం 16 ఏండ్లు మాత్రమే.

"""/" / డాష్ డాష్ సినిమా  తెరకు పరిచయమై.ప్రేమకథ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నందిత దాస్.

2012లో తను హీరోయిన్ గా మారే సమయానికి తన వయసు 17 ఏండ్లు.

అటు 2015లో వచ్చిన ఆంధ్రాపోరీ సినిమా హీరోయిన్ ఉల్కా గుప్తా.అప్పుడు తన వయసు 18 సంవత్సరాలు.

2015లో వచ్చిన గాయకుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన బ్యూటీ శ్రియా శర్మ.

అప్పుడు తన వయసు 17 ఏండ్లు.

అవినీతి గురించి జగన్ మాట్లాడడమా..? లోకేష్ సెటైర్లు