ఆ విషయంలో హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న హీరోయిన్లు..
TeluguStop.com

ఒకప్పుడు హీరోయిన్లు అంటే సినిమాల్లో రొమాన్స్ ను పండించడానికి మాత్రమే ఉపయోగించుకునే వారు దర్శకులు.


వారిని కేవలం గ్లామర్ డాల్స్ గానే ప్రజెంట్ చేసేవారు.కానీ ప్రస్తుతం ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు అందాల తారలు పోటీ పడుతున్నారు.


అందంతో పాటు నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఓ వైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు నటనా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు చేస్తున్నారు.
తమ అద్భుత నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని హీరోలకు పోటీ ఇస్తున్నారు.
గతంలో నాలుగు పాటలకు స్టెప్పులు వేసి.ఐదారు సీన్లకు పరిమితం అయ్యే పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి.
హీరోలతో పోటీగా నటనలో ముందుకెళ్తున్నారు.తమకున్న క్రేజ్ తో సినిమాల్లో హైప్ ను పెంచుతున్నారు.
"""/" /
తాజాగా రష్మిక మందన తన అద్భుత నటనతో హీరోలతో సమానమైన క్యారెక్టర్లు సంపాదించు కుంటుంది.
శర్వానంద్ తో తాజాగా చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేస్తుందట.
గ్లామర్ తో ఆకట్టుకోవడమే కాకుండా మంచి క్యారెక్టర్లు చేసి ఆడియెన్స్ ను తన వైపు తిప్పుకుంటుంది.
తాజాగా ఆమె నటించిన పుష్ప సినిమాలో మంచి క్యారెక్టర్ చేసి ఆకట్టుకుంది.అల్లు అర్జున్ మూలంగా ఈ సినిమాకు ఎంత పేరు వచ్చిందో.
రష్మిక వల్ల అంతే పేరు వచ్చింది.అటు సమంతా పాట కూడా ఈ సినిమాకు ఎంతో పేరు తెచ్చింది.
ఒక్క స్పెషల్ సాంగ్ తో సినిమా రేంజిని మార్చేసింది.అందరూ అనుకున్నదాని కంటే ఎక్కువ ఆకట్టుకుని సినిమా హిట్ లో ఈ పాట కీ రోల్ ప్లే చేసింది.
"""/" /
అటు పూజా హెగ్డే గతంలో పెద్దగా ఆకట్టుకునే రోల్స్ చేసేది కాదు.
కేవలం స్కిన్ షోకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేది.కానీ ఒకేసారి తన అద్భుత క్యారెక్టర్ తో ఆకట్టుకుంది.
అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో తన నటన అద్భుతం .ఈ సినిమాలో తనే హీరో అనేలా నటించింది.
ఈమె నటన మూలంగానే జనాలు ఈ సినిమాను అనుకున్న దానికంటే ఎక్కువగా ఆదరించారు అని చెప్పుకోవచ్చు.
పూజా ఉంటే ఈ సినిమా హిట్ అనే స్థాయికి ప్రస్తుతం సినిమాలు చేరాయంటే.
తన నటన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన కారు ఎలా గుద్దిందో చూడండి!