వైరల్ వీడియో: రీల్స్ కోసం అదిరిపోయే డాన్స్ వేసిన సీనియర్ హీరోయిన్స్!
TeluguStop.com
ఒకప్పుడు టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్స్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
అయితే కాలక్రమేణా కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉండటంతో పాత హీరోయిన్స్ అందరూ దాదాపు ఇండస్ట్రీకి దూరమయ్యారు.
కొందరు సినిమాలు లేక, అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమవ్వగా, మరికొందరు ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ తమ అభిమానులను అలరిస్తున్నారు.
సినిమాలు లేకపోవడంతో కొంతమంది హీరోయిన్స్ తమ వ్యక్తిగత జీవితాల్లోనే బిజీగా మారిపోయారు.అయితే, ఇన్నాళ్ల తర్వాత ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ మళ్ళీ అభిమానుల ముందుకు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి.
సంతోషం మామూలుగా ఉండదు.ఒక్క హీరోయిన్ కనిపించినా ఆనందించే ప్రేక్షకులు, ఒకేసారి ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ కలిసి కనిపిస్తే ఆ ఆనందానికి హద్దులు ఉండవు.
ఇటీవల, ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా తమ ప్రతిభతో అలరించిన మీనా (Meena), సంగీత (Sangeetha), మహేశ్వరి (Maheswari) ముగ్గురూ ఒకే చోట చేరి సరదాగా ఒక మాస్ రీల్ చేయడంతో అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
వీరు ముగ్గురూ కలసి ఒక మ్యూజిక్ ట్రాక్‌కు ఇష్టమైనట్టు డాన్స్ చేశారు.ఈ సరదా రీల్‌ను షేర్ చేయగానే ఇది ఫ్యాన్స్ ను తెగ ఖుషి చేసింది.
"""/" /
కేవలం ఈ రీల్ మాత్రమే కాకుండా.ఇటీవల రోజా, మీనా, రంభ, నగ్మా, మహేశ్వరి, సంగీత తదితర సీనియర్ హీరోయిన్స్ చెన్నైలో నిర్వహించిన ప్రభుదేవా (Prabhudeva) లైవ్ డాన్స్ ఈవెంట్లో కూడా సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో వారు తీసుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ రీల్‌లో కనిపించిన మీనా ఇప్పటికీ సినిమాలు, టీవీ షోలు చేస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది.
అలాగే, సంగీత కూడా సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది.అయితే, మహేశ్వరి మాత్రం తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వకపోయినా, తమిళ్ టీవీ షోలలో మాత్రమే కనిపిస్తోంది.
"""/" /
ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించిన వీరు.
అప్పట్లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.అయితే, ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ కావడంతో, ప్రస్తుత దర్శకులు వీరికి అవకాశాలు ఇవ్వడంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఫలితంగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకుంటున్న వీరు అప్పుడప్పుడు టీవీ షోలలో సందడి చేస్తూ తమ సత్తా చాటుతున్నారు.
మొత్తం మీద, ఈ సీనియర్ హీరోయిన్స్ ఒకే చోట చేరి, తమ అభిమానులకు వినోదాన్ని అందించారు.