సెలబ్రిటీల మల్టిపుల్ రోల్స్.. సంపాదనలో సత్తా చాటుతున్న కథానాయికలు

సాధారణంగా సెలబ్రిటీలను చూడగానే జనం ఎగబడిపోతారు.వారితో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకుగాను, వారి గురించి వివరాలు తెలుసుకునేందుకుగాను ఆరాటపడుతుంటారు.

అయితే, అప్పట్లో సెలబ్రిటీలకు రెమ్యునరేషన్ ఇప్పుడున్నంత లేదని పలువురు అంటున్నారు.ప్రస్తుతం దీపమున్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిలో సెలబ్రిటీలు బాగానే సంపాదిస్తున్నారట.

హీరోయిన్స్ విషయానికొస్తే.అప్పట్లో హీరోయిన్స్ సినిమాలు మాత్రమే చేసుకునేవాళ్లు.

కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు.కథానాయికలు ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తున్నారు.

ఓ వైపున సినిమాలు చేస్తూనే మరో వైపున ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు.కమర్షియల్ యాడ్స్‌లోనూ నటిస్తున్నారు.

యాడ్స్‌కు కూడా రెమ్యునరేషన్ బాగానే తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో టాక్ వినబడుతోంది.

తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న హీరోయిన్ కృతిశెట్టి.ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపున కమర్షియల్ యాడ్స్‌లోనూ కనబడుతోంది.

ఒకే ఒక్క సినిమాతో కృతిశెట్టి కుర్రకారుకు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.ఈ క్రమంలోనే ఈ భామకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు.

ఇకపోతే ఈ భామ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌లో కనబడుతూ సందడి చేస్తోంది.కమర్షియల్ ఓపెనింగ్స్‌ ద్వారా బానే సంపాదిస్తుందట ‘ఉప్పెన’ ఫిల్మ్ హీరోయిన్.

ఇప్పటి వరకు పన్నెండు మాల్స్ ఓపెనింగ్స్‌కు కృతిశెట్టి హాజరైందట.ఇక సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ చేయడం ద్వారా కూడా హీరోయిన్స్ బాగానే సంపాదిస్తున్నారట.

"""/"/ మొత్తంగా ప్రజెంట్ సెలబ్రిటీలు మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తూ సత్తా చాటుతున్నారు.

‘జాతిరత్నాలు’ సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా నటించింది ఒకటే సినిమాలో అయినా కమర్షియల్ మాల్ ఓపెనింగ్స్‌లో మెరుస్తోంది.

అలా షాపింగ్ మాల్స్ ప్రమోషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ హీరోయిన్స్ బాగానే సంపాదిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇలా డబ్బులు సంపాదించుకోవడం మంచిదేనని పలువురు సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు.

సోషల్ మీడియాలో పలు యాక్టివిటస్ ప్రమోషన్స్ చేస్తూ పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్స్‌గా ఉంటూ హీరోయిన్స్ బాగానే సంపాదిస్తున్నారు.

మొత్తంగా జనం మధ్యే ఉంటూ హీరోయిన్స్ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. అయితే ఇలా చేయండి!