ఆ స్టార్ హీరోల వల్లే.. కొత్త హీరోయిన్ల కెరీర్ నాశనం అవుతుందా?

ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అంటే అంత సులభమైన విషయమేమీ కాదు.

ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కూడా కలిసి రావాలి అని చెప్పాలి.అదృష్టం కలిసి రావడమే కాదు కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.

కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ల కెరీర్ తొందరగా ముగుస్తుంది అనే భావన ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.

ఇక ఇలా హీరోయిన్ల కెరియర్ కాలం తక్కువ కావడానికి కారణం కొంతమంది సీనియర్ హీరోలు దర్శక నిర్మాతలే అనేది నెటిజన్ల నుంచి ఎక్కువగా టాక్ వినిపిస్తుంది.

ఒకప్పుడు వెంకటేష్ ,చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సరసన యువ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటిస్తే.

కెరీర్ నాశనం చేసుకుంది అంటూ ఆమెను తిట్టిపోశారు ఫాన్స్.ఇప్పుడు కూడా ఎంతో మంది హీరోయిన్లు ఇలా సీనియర్ హీరోల సరసన నటించి చివరికి కెరీర్ నాశనం చేసుకుంటున్నారు అన్నది తెలుస్తుంది.

ఇందుకు 50 ఏళ్లు పైబడిన హీరోలతో నటిస్తు ఉన్నారు.ఇందుకు చక్కటి ఉదాహరణ రవితేజ శ్రీలీలను తీసుకోవచ్చు.

వీరిద్దరి కాంబినేషన్ ఊహించుకోవడానికి కూడా రబాలేదని ఎంతో మంది అభిప్రాయం. """/"/ ఇటీవలే విడుదలైన ధమాకా టీజర్ చూస్తే ప్రేక్షకులు వీరు జోడిని పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నారు.

50 ఏళ్ల పైబడిన రవితేజ పట్టుమని పాతికేళ్లు కూడా లేని చిన్న పిల్ల తో రొమాంటిక్ సీన్స్ చేయడం ఏంటి అంటూ అందరూ విమర్శలు కూడా చేస్తున్నారు.

ఇక అచ్చం ఇలాగే తమన్నాభాటియా కాజల్ అగర్వాల్ నయనతార సహా మరికొంతమంది హీరోయిన్లు కూడా ఇక సీనియర్ హీరోలతో నటించడం కారణంగా తమ కెరీర్ని చేజేతులారా ప్రమాదంలో పడేసుకుంటున్నారు అని విశ్లేషకులు చెబుతున్న మాట.

ఇప్పుడైనా హీరోయిన్లు తమ కెరీర్ విషయంలో కాస్త జాగ్రత్త పడతారో లేదో చూడాలి.

ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత మరో స్టార్ డైరెక్టర్ ను సెట్ చేసిన ఎన్టీయార్…