బాబోయ్.. తమన్నాకు ఇంకా పెళ్లి వయసు రాలేదా? ఇదెక్కడి చోద్యం?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా అదే ఊపుతూ అదే క్రేజ్ తో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అదే రేంజ్ లో కొనసాగాలి అని చూస్తోంది.

కానీ బాలీవుడ్ లో తమన్నా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.అయినా కూడా విరమించకుండా వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ దూసుకుపోతుంది.

మూడు పదుల వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.అయితే చాలామంది తమన్నా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న తమన్నా పెళ్లి ఎప్పుడు.

ఇదే విషయంపై అనేక రకాల వార్తలు వినిపించినప్పటికీ తమన్నా మాత్రం ఆ వార్తల పై సరిగా స్పందించలేదు.

వార్తలు వచ్చినప్పుడు వాటిని స్కిప్ చేస్తూ వస్తోంది ఈ మిల్కీ బ్యూటీ.తాజాగా తమన్నా ఈ పెళ్లి వార్తలపై స్పందిస్తూ వ్యక్తిగతంగా నేనంతా పరిణతి చెందాను అమ్మానాన్న ఆలోచనలోనూ అంతే పరణతి కనిపిస్తుంది.

నా కెరిర్ ను గమనిస్తున్న వాళ్ళు ఏ రోజు పెళ్లి అంటూ నాకు ఒత్తిడి తీసుకురాలేదు.

"""/"/ ఒకవేళ ఆ సమయం వస్తే ఇంట్లోనూ, మీడియాకు నేను స్వయంగా చెబుతాను అని తెలిపింది తమన్నా.

స్పందించిన పలువురు ఆమెకు ఇంకా పెళ్లి వయసు రాలేదు అనుకుంటుందా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక తమన్నా మాటలను బట్టి చూస్తే నెటిజన్స్ అంటున్న మాటలే నిజం అన్న అనుమానాలు వస్తున్నాయి.

తమన్నా ఇప్పటివరకు పెళ్లి చేసుకోక పోవడానికి లవ్వు ఏమైనా కారణమా అంటే అది లేదు.

ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ఇంతవరకు హీరోతో కానీ డేటింగ్ చేయలేదు.అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఎవరితోనో కలసీ మీడియా కంట కూడా పడలేదు.

కానీ తమన్నా తల్లిదండ్రులు తమన్నా కు పెళ్లిచూపులు చూడకపోవడం పట్ల తమన్నా అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

కోమాలోకి వెళ్ళడానికి కొన్ని గంటల ముందు సావిత్రి చెప్పిన మాటలు