అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న సీరియల్ హీరోయిన్….
TeluguStop.com
తెలుగులో ప్రముఖ దర్శకుడు యోగి దర్శకత్వం వహించిన "జాదూగాడు" అనే చిత్రంలో నాగశౌర్య కి జంటగా నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ సోనారిక భండారియా తెలుగు సినీ ప్రేక్షకులకి సుపరిచితమే.
అయితే బాక్సాఫీసు వద్ద ఈచిత్రం పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడు గుర్తింపుకు నోచుకోలేపోయింది.
అయితే ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించినటువంటి స్పీడున్నోడు, ఆడోరకం ఈడోరకం తదితర చిత్రాల్లో నటించింది.
అయితే ఈ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో తిరిగి మూట ముల్లె సర్దుకుని ముంబై చెక్కేసింది.
అయితే ఎలాగోలా బాలీవుడ్లో ఓ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది.
దీంతో ఇక ఈ అమ్మడు చేసేదేమీ లేక మళ్ళీ సీరియల్లో నటించడం ప్రారంభించింది.
దీంతో ఒక పక్క సీరియళ్లలో నటిస్తూనే మరో పక్క పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన హాట్ హాట్ అందాలతో బికిని దుస్తులు ధరించి ఫోజులు ఇస్తోంది.
అంతేగాక ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది.
దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోత కి నెటిజన్లు ఫిదా అయ్యారు.అయితే ఆ మధ్య అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించిన సోనారిక తన క్యారెక్టర్ కి తగ్గ పాత్ర వస్తే ఎలాంటి బోల్డ్ తరహా పాత్రలోనైనా నటించడానికి సిద్ధమేనంటూ తెగేసి చెప్పింది.
దీంతో మరి దర్శక నిర్మాతలు ఈ అమ్మడికి అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోనారిక హిందీలో "ఇష్క్ మెయిన్ మర్జావ" అనే ధారావాహికలో హీరోయిన్ గా నటిస్తోంది.
గతంలో సోనారిక భండారియా పార్వతి దేవి పాత్రలో హర హర మహాదేవ అనే ధారావాహిక లో నటించింది.
ఈ ధారావాహిక ద్వారా సోనారిక భండారియా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఇటీవలే సోనారిక తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న యాక్షన్ అండ్ క్రైమ్ ఓరియెంటెడ్ తరహా చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.