ఈ లవ్లీ హీరోయిన్ ఎందుకో తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోతోంది…

తెలుగులో ప్రముఖ దర్శకురాలు బి.జయ దర్శకత్వం వహించినటువంటి లవ్లీ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి ముద్దుగుమ్మ శాన్వి శ్రీ వాత్సవ  గురించి తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా తెలియని వారుండరు.

అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించి తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే తన తదుపరి చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ అమ్మడు నటించినటువంటి పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

దీంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వరించలేదు.దాంతో చేసేదేమీ లేక కన్నడ సినీ పరిశ్రమకి తన మకాం ని మార్చింది.

అయితే అక్కడ మాత్రం వరుసగా అవకాశాలు దక్కించుకుంది.కానీ అక్కడ కూడా సరైన హిట్ లేక పోవడంతో కొంతమేర తన ఉనికిని చాటుకునేందుకు అష్ట కష్టాలు పడుతోంది.

అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు కన్నడలో హీరోయిన్ గా నటించిన "అవనే శ్రీమన్నారాయణ" అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం తెచ్చి పెట్ట లేకపోయింది.

కాగా మళ్లీ అవకాశాల కోసం ఈ అమ్మడు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.గతంలో ఓ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్నటువంటి ఈ అమ్మడు తనకు తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని ఒక్క అవకాశం ఇవ్వాలని కూడా స్టేజి పైనే బోరున ఏడ్చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు కన్నడ భాషలో  ప్రముఖ దర్శకుడు ఓం ప్రకాష్ రావు దర్శకత్వం వహిస్తున్నటువంటి "రవిచంద్ర" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నటువంటి వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ అమ్మడు తెలుగులో ఆది సాయి కుమార్, సుశాంత్, మంచు విష్ణు తదితర హీరోలతో కలిసి నటించింది.

కాంగ్రెస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలు..: జేపీ నడ్డా