మళ్లీ బికినీకి సిద్ధం అవుతున్న సమంత..!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత త్వరలో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

గతంలో ఒక తమిళ సినిమా కోసం టూ పీస్ బికినీ ధరించిన సమంత మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత బికినీలో కనిపించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తల విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు కాని మీడియా వర్గాల్లో మరియు సినీ వర్గాల్లో మాత్రం చాలా ప్రముఖంగా ఈ విషయం గురించి చర్చించుకోవడం కనిపిస్తుంది.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడం కోసం సమంత చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

ఆ మద్య నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత నుండి చేస్తున్న సినిమా లు అన్నీ ఇన్నీ కావు.

అదుగో ఇదుగో అంటూ ఈ అమ్మడి సినిమాల గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంలో భాగంగా శాకుతలం.యశోదా.

కాతువాకుల రెండు కాదల్ వంటి విభిన్న జోనర్‌ సినిమాలు చేస్తోంది.అందులో భాగంగానే ఇటీవల కమిట్‌ అయిన ఒక సినిమా కోసం సమంత చాలా గ్లామర్‌ గా కనిపించబోతుందట.

అక్కినేని వారి ఇంటి కోడలు అవ్వడం వల్ల సినిమా ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అసలు కమర్షియల్‌ పాత్రలను చేసేందుకు ఒప్పుకోలేదు.

కారణం ఏంటో కాని చైతూ నుండి విడి పోయిన తర్వాత ఇక రచ్చ రచ్చ అన్నట్లుగా ఈ అమ్మడి జోరు కొనసాగిస్తూ ఉంది.

అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ప్రతి చోట కూడా ఈ అమ్మడి ఫోటో లు వైరల్‌ అయ్యేంతగా స్కిన్‌ షో చేస్తోంది.

తాజాగా టాప్ లో బికినీ వేసి ఆకట్టుకున్న సమంత త్వరలోనే వెండి తెరపై మళ్లీ బికినీతో సందడి చేసేందుకు సిద్ధం అన్నట్లుగా ఎదురు చూస్తున్నట్లుగా మీడియా వర్గాల వారు అంటున్నారు.

అసలు విషయం ఏంటీ అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి ఉంది.