స్నేహితుడిని నమ్మి 14 కోట్ల రూపాయలు మోసపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే?
TeluguStop.com
సాధారణంగా స్నేహితులకు కష్టాలు ఎదురైతే ఎవరైనా తమ వంతు సహాయం చేస్తారు.స్నేహితుల మాటలకు చాలామంది ఎంతో విలువ ఇస్తారు.
అయితే తాను మాత్రం ఫ్రెండ్ అని నమ్మి నిలువునా మోసపోయానని రిమి సేన్ చెబుతున్నారు.
4.14 కోట్ల రూపాయలు తాను అప్పుగా ఇస్తే ఇప్పుడు ఆ మొత్తం 14 కోట్ల రూపాయలు అయిందని ఆమె చెప్పుకొచ్చారు.
రోనక్ వ్యాస్ అనే వ్యక్తి నన్ను మోసం చేశాడని ఆమె తెలిపారు. """/" /
రెండు సంవత్సరాల క్రితం తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ కేసు ఇప్పుడు సీఐడీకి బదిలీ అయిందని ఆమె పేర్కొన్నారు.
నాలుగు సంవత్సరాల క్రితం జిమ్ లో రోనక్ అనే వ్యక్తిని కలిశానని తనతో ఫ్రెండ్ షిప్ చేశానని అయితే ఆ వ్యక్తి మాత్రం నన్ను మోసం చేశాడని ఈ నటి చెప్పుకొచ్చారు.
ఆ వ్యక్తి చేతిలో అహ్మదాబాద్( Ahmedabad ) లో చాలామంది మోసపోయారని సమాచారం అందిందని ఆమె తెలిపారు.
"""/" /
రోనక్ ( Ronak )మా ఇంటికి కూడా వచ్చాడని మా అమ్మతో కలిసి భోజనం చేశాడని ఆ తర్వాత అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించాడని ఈ నటి పేర్కొన్నారు.
అధిక వడ్డీ అని చెప్పి మొదట 20 లక్షల రూపాయలు తీసుకున్నాడని 9 శాతం వడ్డీ ఇచ్చేవాడని రిమి సేన్ పేర్కొన్నారు.
ఆ తర్వాత 12 నుంచి 15 శాతం వడ్డీ ఇస్తానని చెప్పాడని రిమి సేన్ ( Rimi Sen )వెల్లడించారు.
అలా నేను 4.14 కోట్ల రూపాయలు ఇచ్చానని ఆమె పేర్కొన్నారు.
మొదటి నెల ఐదారు లక్షలు చేతికి ఇచ్చాడని తర్వాత వాళ్ల నాన్నకు కరోనా వచ్చిందని డబ్బులు ఇవ్వలేమని చెప్పాడని రిమి సేన్ వెల్లడించారు.
నెలల తరబడి సాకులు చెప్పి తప్పించుకోవడంతో ఇది స్కామ్ అని అర్థమైందని ఆమె తెలిపారు.
తాను చేసిన ఫిర్యాదు సీఐడీకి బదిలీ అయిందని రిమి సేన్ వెల్లడించారు.ఈ కేసు విషయంలో ఎంత దూరమైనా వెళ్తానని ఆమె చెప్పుకొచ్చారు.
మిగిలిపోయిన రైస్ తో బెస్ట్ డీ-టాన్ రెమెడీ.. రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు!