రకుల్ ప్రీత్ సర్జరీ వికటించిందా.. అందుకే మొహం ఇలా అయిపోయిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఆ తరువాత ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళం, హిందీ భాషలలో సినిమా అవకాశాలను దక్కించుకుని ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను, తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.

ప్రస్తుతం పలు భాషలలో సినిమాలు తీయడం వల్ల ఈమె వారంలో ముంబై, చెన్నై, హైదరాబాద్ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ఇలా వారం మొత్తం ప్రయాణాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు.

ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురై అసలు ఇక్కడ రకుల్ ఏనా అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

ఎంతో బొద్దుగా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ బుగ్గలు పూర్తిగా లోనికి లాగాయి.

బుల్లి బుల్లి పెదవులు ఇప్పుడు బాగా  పెద్దవిగాను కనిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంది.

ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకుల్ ప్రీత్ సింగ్ ఏమైనా సర్జరీ చేయించుకుందా.

ఆ సర్జరీ వికటించడం వల్లే ఈ విధంగా మారిపోయిందా అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

రకుల్ ప్రీతి సింగ్ ఇన్ స్టా ద్వారా ఈ ఫోటోను షేర్ చేస్తూ లండన్ అనే క్యాప్షన్ ఇచ్చారు.

దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం చిన్నది లండన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.ఏదిఏమైనప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా తన రూపం మారిపోయి ఉన్నటువంటి ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?