తల్లిగా మారనున్న కాజల్...? అయోమయంలో అభిమానులు...

టాలీవుడ్ సినీ నటి గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్.ఈమె పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే.

తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది.

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా నిలిచింది.

ప్రస్తుతం పలు సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది కాజల్.

"""/"/ ఇదిలా ఉంటే కాజల్ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

దీంతో తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవుతుందా అని అభిమానులు తెగ ప్రశ్నలు వేశారు.

కానీ పెళ్లి తర్వాతనే రెట్టింపు సినిమాలతో బిజీగా ఉంది.ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా అసలు తగ్గట్లేదు.

పైగా డీ గ్లామర్ పాత్రల్లో కూడా నటించడానికి ముందుకు వస్తుంది.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక నాగార్జున తో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించనుంది.బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో బిజీగా ఉంది.

హే సినామిక, ఘోస్ట్ లీ, ఇండియన్ 2 సినిమాలలో నటిస్తుంది.అంతేకాకుండా తమిళ రీమేక్ సినిమాలో కూడా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తల్లిగా మారనుందట. """/"/ గౌతమ్ ని పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చిన కాజల్ మళ్లీ తల్లిగా మారతుందన్న వార్తతో అభిమానులు మరింత ఆశ్చర్యపోతున్నారు.

ఇక నిజంగానే కాజల్ తల్లి కాబోతుందా.ఇకపై సినిమాలలో నటించదా అని ప్రశ్నలు వస్తున్నాయి.

కానీ కాజల్ ​తల్లి అయ్యేది నిజ జీవితంలో కాదు.తాను నటించే తమిళ సినిమా 'రౌడీ బేబీ'.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ డీ గ్లామర్ పాత్రలో కనిపించనుంది.శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా తల్లి కూతుళ్ళ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతుంది.

దీంతో కాజల్ ఓ అమ్మాయికి తల్లి పాత్రలో కనిపించనుందట.మొత్తానికి కాజల్ తల్లి కానున్న విషయం నిజజీవితంలో కాదనేసరికి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మోడీ జీ .. మీ ఫ్రెండ్‌తో మాట్లాడండి, భారతీయుల బహిష్కరణపై పంజాబ్ మంత్రి