ఈ తెలుగు హీరోల భార్యలు మాతృభాష ఏంటో తెలుసా..?

ఈ తెలుగు హీరోల భార్యలు మాతృభాష ఏంటో తెలుసా?

చాలామంది హీరోయిన్స్ ఇతర రాష్ట్రాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తెలుగు హీరోలనే పెళ్లి చేసుకున్నారు.

ఈ తెలుగు హీరోల భార్యలు మాతృభాష ఏంటో తెలుసా?

ఆ ఇతర భాష ముద్దుగుమ్మలు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.1.

ఈ తెలుగు హీరోల భార్యలు మాతృభాష ఏంటో తెలుసా?

రేణు దేశాయ్ - పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణే లో స్థిరపడ్డారు.

ఆమె తల్లిదండ్రులు గుజరాత్ కి చెందినవారు కాగా.ఆమె మాతృభాష గుజరాతి.

మొదట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 2000 లో జేమ్స్ పాండు అనే ఓ తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.

అదే సంవత్సరం లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్తా ప్రేమకు పెళ్లికి దారితీసింది.

అయితే పవన్ కళ్యాణ్ తో సహాజీవనం చేయడానికి రేణుదేశాయ్ హైదరాబాద్ నగరానికి షిఫ్ట్ అయ్యారు.

అలాగే తెలుగు భాష స్పష్టంగా నేర్చుకున్నారు.ఈ విధంగా గుజరాతి ముద్దుగుమ్మ రేణు దేశాయ్ తెలుగు హీరో అయిన పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్నారు.

"""/"/ 2.నమ్రతా శిరోద్కర్ - మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ మరాఠీ కుటుంబంలో జన్మించారు.

ఆమె బొంబాయిలో స్థిరపడ్డారు.మొదట్లో మోడల్ గా పనిచేసిన ఆమె 1993 మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకున్నారు.

మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొని 6వ స్థానంలో నిలిచారు.నమ్రతా శిరోద్కర్ చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయ్యారు.

ఐతే 2000 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ వంశీ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

వంశీ సినిమా చిత్రీకరణ సమయంలో మహేష్ బాబు తో ఆమె ప్రేమలో పడ్డారు.

2005లో మహేష్ ని పెళ్లి చేసుకొని హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు.అయితే మాతృ భాష మరాఠీ అయినప్పటికీ ఆమె మహేష్ బాబు ని పెళ్లి చేసుకున్న తర్వాత తెలుగు బాగా నేర్చుకుని బాగా మాట్లాడుతున్నారు.

"""/"/ 3.అమల ముఖర్జీ - అక్కినేని నాగార్జున టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగార్జున రెండవ భార్య అమల ముఖర్జీ కూడా తెలుగు కుటుంబంలో జన్మించలేదు.

ఆమె తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు కాగా తండ్రి బెంగాలీ.చిన్నప్పటినుంచే బెంగాలీ మాట్లాడుతూ పెరిగిన పెద్దయిన అమల మొదటిసారిగా భారతీయ రాజా దృష్టిలో పడి తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.

ఆ తర్వాత చినబాబు(1998) చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు.మొదట్లో తెలుగు భాష అర్థం కాక అమల చాలా ఇబ్బంది పడేవారు.

అయితే చినబాబు చిత్రీకరణ సమయంలో ఆమె నాగార్జునతో ప్రేమలో పడ్డారు.1992 లో నాగార్జున ను పెళ్లి చేసుకున్నారు.

మాతృ భాష బెంగాలీ అయినా కూడా నాగార్జున ను పెళ్లి చేసుకున్న తర్వాత అమల తెలుగు బాగా నేర్చుకున్నారు.

"""/"/ 4.అక్కినేని నాగ చైతన్య- సమంత రూత్ ప్రభు మలయాళీ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన సమంత చెన్నైలో స్థిరపడ్డారు.

సమంతా తల్లి మలయాళీ అయినా తండ్రి మాత్రం తెలుగువారే.అయితే ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసిన తర్వాత నాగ చైతన్య తో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.2017 లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

"""/"/.

రోజుకు 4 జీడిప‌ప్పుల‌ను తేనెతో క‌లిపి తింటే లాభాలే లాభాలు!