గెటప్పులతో అంచనాలు పెంచుతున్న స్టార్ హీరోలు వీళ్లే..?
TeluguStop.com
ఏదైనా కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడితే ఆ సినిమాలో హీరోల గెటప్ కు సంబంధించి ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొంటాయనే సంగతి తెలిసిందే.
చిరంజీవి కొన్ని నెలల క్రితం గుండు గెటప్ లో కనిపించారు.వేదాళం రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి గుండు బాస్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తోంది.
"""/"/
ఇప్పటివరకు ఎన్నో పాత్రలు పోషించిన బాలకృష్ణ అఖండ సినిమాలో తొలిసారి అఘోరా పాత్రలో కనిపించనున్నారు.
బాలయ్య చేతికి ఉంగరాలు, మెడలో రుద్రాక్షలతో వెరైటీ గెటప్ లో ఈ సినిమాలో నటించడం గమనార్హం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కోసం తన గెటప్ ను పూర్తిగా మార్చుకున్నారు.
మొఘల్ కాలం నేపథ్యంలో హరిహర వీరమల్లు కథ సాగుతుందనే సంగతి తెలిసిందే. """/"/
ఇప్పటికే పవన్ కు సంబంధించిన ఒక గెటప్ రివీల్ కాగా ఈ సినిమా పవన్ మరో రెండు గెటప్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది.
సలార్ సినిమాలో ప్రభాస్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తుండగా ఈ సినిమా కోసం ప్రభాస్ తనను తాను పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే.
ప్రతి సినిమాలో లుక్ పరంగా ఒకే విధంగా కనిపించే నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో బెంగాల్ కు చెందిన యువకుని పాత్రలో నటించనున్నారు.
"""/"/
థ్యాంక్ యూ సినిమా లో నాగచైతన్య స్టూడెంట్ రోల్ లో నటిస్తుండగా చైతన్య ఈ రోల్ కోసం తన లుక్ ని పూర్తిగా మార్చుకోవడం గమనార్హం.
ఖిలాడీ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా ఈ సినిమాలో రవితేజ భిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారు.
వెంకటేష్ హీరోగా నారప్ప సినిమా తెరకెక్కుండగా ఈ సినిమాలో వెంకటేష్ రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.
నా భార్య చాలా మొండిది… ఎన్టీఆర్ చేసే ఆ వంటకం చాలా ఇష్టం: రాజీవ్ కనకాల