Vishwak Sen :త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో విశ్వక్ సేన్.. వధువు ఎవరో తెలుసా?
TeluguStop.com
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్( Hero Vishwak Sen ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
హీరో విశ్వక్ సేన్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.
తెలుగులో ఇప్పటివరకు దాస్ కా ధమ్కీ, ఓరి దేవుడా, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఫలక్ నుమాదాస్( Falaknuma Das ) లాంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు విశ్వక్ సేన్.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విశ్వక్ సేన్ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
"""/" /
ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది.
హీరో విశ్వక్ సేన్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు.త్వరలోనే తాను ఒక ఇంటివాడిని అవ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఈ మేరకు తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా( Instagram )లో పోస్ట్ చేశారు.
అయితే పెళ్ళి( Vishwaksen Marriage )కి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అనగా ఆగస్టు 15న వెల్లడిస్తానని తెలిపారు.
అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
"""/" /
వధువు ఎవరు అని కొందరు కామెంట్స్ చేస్తుండగా అన్నయ్య మా వదినను ఎప్పుడు పరిచయం చేస్తావ్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకొందరు అడ్వాన్స్ హ్యపీ మ్యారీడ్ లైఫ్( Advance Happy Married Life ) అంటూ పోస్టులు పెడుతున్నారు.
మరికొందరేమో కొత్త సినిమా ప్రకటిస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.కొంతమంది కచ్చితంగా సినిమా గురించి అప్‌డేట్ ఈ మధ్యకాలంలో ఇలాంటి సస్పెన్షన్లు ఎక్కువ అయ్యాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే మరి.
ఎన్టీఆర్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీకి నేను పెద్ద ఫ్యాన్.. వెంకటేశ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!