కొడుకు కంటే చిన్న వయసు ఉన్న అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన పృథ్వీ.. అందుకే బిగ్ బాస్ కి వెళ్లలేదు!
TeluguStop.com
ఎన్నో తెలుగు హిందీ తమిళ భాషలలో నటుడిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బబ్లూ పృథ్వీ ( Pruthvi ) ఒకరు.
ఈయన హీరోగా ఎన్నో సినిమాలలోను నటించారు.అలాగే విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు ఇక సినిమాలో మాత్రమే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు.
ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన రెండో పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
"""/" /
పృథ్వీ గతంలో బీనా( Beenaa ) అనే మహిళను వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు 27 సంవత్సరాలకు కుమారుడు కూడా ఉన్నారు.ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.
అనంతరం ఈయనకు 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శీతల్( Seethal ) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.
దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం తనతో పెళ్లికి అమ్మాయి కూడా ఒప్పుకోవడంతో త్వరలోనే పెళ్లికి సిద్ధమయ్యారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడారు.
"""/" /
మొదట తాను నేను ప్రపోజ్ చేస్తే శీతల్ తన ప్రేమను అంగీకరించిందని తాను ఎంతో మంచి అమ్మాయి అని త్వరలోనే మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నామని ఈయన తెలియజేశారు.
ప్రస్తుతం మేమిద్దరం మా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు తను నాకన్నా చాలా చిన్నది అయినప్పటికీ ప్రేమకు నెంబర్ తో పనిలేదని తెలిపారు.
పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పారు కానీ ఎప్పుడు అనే విషయాన్ని తెలియజేయలేదు.ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన బిగ్ బాస్ ( Bigg Bos S)కార్యక్రమం గురించి కూడా మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలి అంటే చాలా ఆసక్తి అని అయితే ఈ అవకాశం వచ్చిన ప్రతిసారి తాను ఏదో ఒక సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటానని ఈయన తెలిపారు.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ చాలా మంచి ఇండస్ట్రీ అక్కడ పనిచేసిన వారికి ఎలాంటి అన్యాయం జరగదు కానీ ఇతర చిత్ర పరిశ్రమలో పని చేయించుకొని చాలామంది డబ్బులు ఎగ్గొట్టారని ఈ సందర్భంగా పృథ్వీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నదిలో పడిపోయిన యజమాని.. నది ఒడ్డునే 4-రోజులు వెయిట్ చేసిన కుక్క.. ఎక్కడంటే..?