Hero Nikhil Siddharth : దయచేసి మన దేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి.. ఇది సిగ్గు పడాల్సిన విషయం.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో నిఖిల్( Hero Nikhil Siddharth ) గురించి మనందరికీ తెలిసిందే.

నిఖిల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.దానికి తోడు నిఖిల్ నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో వరుసగా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.

అందులో భాగంగానే నిఖిల్ నటించిన కార్తికేయ 2, 18 పేజెస్, స్పై లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు.

ప్రస్తుతం స్వయంభు, ది ఇండియన్ హౌస్, కార్తికేయ 3( Karthikeya 3 ) లాంటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

అలాగే నిఖిల్ ఇటీవల తండ్రిగా ప్రమోషన్ ని కూడా అందుకున్న విషయం తెలిసిందే.

"""/"/ ఆయన భార్య పండంటి మగ బిడ్డ( Baby Boy )కు జన్మనివ్వగా ఇటీవలే ఆ బాబుకి బారసాల కార్యక్రమం కూడా చేసిన విషయం తెలిసిందే.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా హీరో నిఖిల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ నిఖిల్ ఏం ట్వీట్ చేసాడంటే.ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ క్వాలిఫయర్‌ మ్యాచ్‌( FIFA World Qualifier Match )/emలో ఇండియా ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి ప్రదర్శనకు ఇండియా ఫుట్‌ బాల్ అసోసియేషన్‌ సిగ్గు పడాలి అంటూ సిద్దార్థ్ విమర్శించారు.

ప్రపంచంలో ‍అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.

"""/"/ దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చాలంటూ కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్( Union Minister Anurag Thakur ), ఇండియన్‌ ఫుట్‌బాల్ కౌన్సిల్‌ను ట్యాగ్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్ గా మారింది.ఆ పోస్ట్ లో ఫిఫా వరల్డ్ కప్‌ క్వాలిఫయర్స్‌ ఫుట్‌బాల్ మ్యాచ్‌ని ఇప్పుడే చూశాను.

మన భారత జట్టు అత్యంత తీవ్రంగా నిరాశపరిచింది.ఇలాంటి ప్రదర్శన పట్ల ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్‌( Indian Football Association ) సిగ్గుపడాలి.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నా.క్రీడల్లో మనం మరింత మెరుగైన ప్రదర్శన చేయాలి.

దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి అని రాసుకొచ్చారు నిఖిల్.కాగా అందుకు సంబందించిన ట్వీట్ వైరల్ అవ్వడంతో కొందరు నిఖిల్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ .. ఆ పదవుల భర్తీపై రానున్న క్లారిటీ