అనుపమ అల్లరిని బయటపెట్టిన నిఖిల్.. షూటింగ్ లో అలా?
TeluguStop.com
టాలీవుడ్ బ్యూటీ కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు అందుకున్న ఈ బ్యూటీ తన అందంతో కూడా యువత మనసులను దోచుకుంది.
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ భాషల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు అందుకుంది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన సంబంధించిన ఫోటోలను, ఫన్నీ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది.
అంతేకాకుండా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇక తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
తన హాట్ ఫోటోలతో కూడా బాగా పిచ్చెక్కిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా మరో యంగ్ హీరో నిఖిల్ తన అల్లరిని బయటపెట్టాడు.
"""/"/
ఈ బ్యూటీ ఇంట్లోనే కాకుండా షూటింగ్ విరామ సమయంలో కూడా బాగా అల్లరి చేస్తుందట.
ఇక తాజాగా ఓ సినిమా షూటింగ్ సమయంలో అల్లరి చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మించారు.
"""/"/
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా అందరిని బాగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే షూటింగ్ సమయంలో అనుపమ చేసిన అల్లరిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఇక ఆ వీడియోలో అందరూ షూట్ కోసం బిజీగా ఉండగా అనుపమ మాత్రం సారంగదరియా పాటకు స్టెప్ వేసి తెగ సందడి చేస్తుంది.
పైగా ఈ వీడియోకు నిఖిల్ ఓ పోస్ట్ షేర్ చేయగా అందులో తను ఇంతవరకు చూసిన వారందరిలోను ఎంతో సంతోషంగా ఉండే వారిలో అనుపమ ది బెస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
ఆడపడుచుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన… పోస్ట్ వైరల్!