పాపం…  సునీల్ ని అప్పట్లో అలా ఏడిపించే వారట….

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి సినీ కుటుంబ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా ఎదిగిన వారిలో టాలీవుడ్ కమెడియన్ మరియు హీరో సునీల్ ఒకడు.

అయితే సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో సునీల్ మొదట పలు హాస్య నటుడి  పాత్రలలో నటించి ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత హీరోగా కూడా పలు చిత్రాల్లో నటించి మంచి  హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాగా ఆ మధ్య కాలంలో సునీల్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినీ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో తాను సినిమా పరిశ్రమకి ఆర్టిస్ట్ అవ్వాలని ఎన్నో ఆశలతో, కలలతో వచ్చిన కొత్తలో సినిమా అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించానని చెప్పుకొచ్చాడు.

అంతేగాక ఒకానొక సమయంలో తాను ఇక అవకాశాలు దక్కించుకోలేనని తెలిసి సినిమా పరిశ్రమని వదిలిపెట్టి వెళ్లి పోవాలని కూడా అనుకున్నాడట.

కానీ ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిచయం కాగా ఇద్దరూ కలిసి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఇద్దరు సినీ స్టార్లుగా ఎదిగారు.

అయితే అప్పట్లో తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి"  చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని కానీ ఆ చిత్రంలో తాను నటించిన ఓ సన్నివేశం ఎడిటింగ్  లో పోయిందని తెలిపాడు.

అయితే ఆ సన్నివేశంలో తాను సింగిల్ టేక్ లో నటించానని దాంతో అప్పటి నుంచి తనని అందరూ సింగిల్ టేక్ సునీల్ అంటూ  ఏడిపించేవారని సరదాగా తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కలర్ ఫోటో అనే చిత్రం లో నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.

కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు..: హరీశ్ రావు