బాలయ్య చేతిలో అరడజను సినిమాలు.. ఏవో తెలుసా?
TeluguStop.com
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నాడు.
అంతేకాకుండా వరుస సినిమాలతో తన ఖాతా నింపుకుంటున్నాడు.ఓ సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే మరో సినిమాకు ఓకే చెబుతున్నాడు బాలయ్య.
ఇక ప్రస్తుతం బాలయ్య చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నాయట.ఇంకేంటి బాలయ్య అభిమానులకు పండగనే చెప్పవచ్చు.
ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రస్తుతం థియేటర్లు బంద్ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది.
థియేటర్లు తెరుచుకున్న వెంటనే అఖండ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.
ఇందులో బాలయ్య ద్వి పాత్రలతో మెప్పించిననున్నాడు.ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా ఓ సినిమాకు సైన్ చేశాడట.
ఈ సినిమా పక్కా మాస్ తో పాటు ఫుల్ యాక్షన్ తో తెరకెక్కనుందని తెలుస్తుంది.
"""/"/
ఇదిలా ఉంటే వెంకీ అట్లూరి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఒక కథను బాలకృష్ణకు రాస్తున్నాడట.
ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు దిల్ రాజు బ్యానర్ లో కూడా వరుస సినిమాలకు ఓకే చేశాడు బాలయ్య.
అంతేకాకుండా సి.కల్యాణ్ తో కూడా మరో ప్రాజెక్ట్ కి సైన్ చేశాడట.
ఇక రాజ్ కందుకూరి దృష్టి కూడా బాలయ్యపై పడిపోవడంతో అతను కూడా బాలయ్య కు కథ రాశాడని తెలిసింది.
"""/"/ ఇక పలువురు డైరెక్టర్లు కూడా బాలయ్య కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి బాలయ్య ప్రస్తుతం యంగ్ హీరోలతో సైతం పోటీగా ఉండటంతో ఏకంగా ఈ ఏడాది ఆరు సినిమాలకు అవకాశం అందుకున్నాడు.
ఇక ఈ సినిమాలన్నీ పూర్తి కావడానికి దాదాపు నాలుగేళ్లు పట్టవచ్చని తెలుస్తోంది.ఇక మొత్తానికి బాలయ్య అభిమానులకు వరుస సినిమాలతో పండగ అనే చెప్పవచ్చు.
ఓజీ హక్కుల కోసం ఇంత పోటీనా.. ఏకంగా జనసేన పార్టీ జనాలే రంగంలోకి దిగారా?