హలో హనుమాన్… ఇలా అయితే అక్కడ వసూళ్లు రాబట్టడం చాలా కష్టం!
TeluguStop.com
తేజ సజ్జా( Teja Sajja ) హీరోగా విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) దర్శకత్వం లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం హను మాన్.
ఈ సినిమా లో ఆంజనేయుడి గురించి చూపించబోతున్నారు.గత ఏడాది లోనే సినిమా ను విడుదల చేయాలని భావించినా కూడా సాధ్యం కాలేదు.
కానీ ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.మొదట ఈ సినిమా ను తెలుగు సినిమా గానే ప్రమోట్ చేయాలి అనుకున్నారు.
కానీ టీజర్( HanuMan Teaser ) కి వచ్చిన రెస్సాన్స్ నేపథ్యం లో ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో వీఎఫ్‌ఎక్స్ ను నిర్వహిస్తున్నారు.
అందుకే ఆలస్యం అవుతుంది అంటున్నారు. """/"/ ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే వందల కోట్లు రాబట్టాలి అంటూ యూనిట్ సభ్యులు పట్టుదలతో ఉన్నారు.
అందుకే పాన్ ఇండియా రేంజ్ లో భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
సినిమా విడుదలకు ఇంకా ఎక్కువ సమయం లేదు.కానీ ఇప్పటి వరకు పబ్లిసిటీ విషయం లో పెద్దగా హడావుడి కనబర్చడం లేదు.
ఎట్టకేలకు ఒక పాటను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది.ఇది సరిపోవడం లేదు, ఇంకా పాన్ ఇండియా రేంజ్( Pan India Release ) లో హడావుడి అవసరం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
"""/"/
మొత్తానికి హనుమాన్ సినిమా ప్రమోషన్ విషయం లో అలసత్వం కు భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తేజ హనుమాన్ విషయం లో బాలీవుడ్( Bollywood ) కూడా ఆసక్తి చూపిస్తోంది.
ఇలాంటి సమయంలో జాగ్రత్తగా పబ్లిసిటీ చేస్తే తప్పకుండా మంచి బిజినెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరి ఆ దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.