ఇండస్ట్రీ లో ఇదే పోకడ..హీరోయిన్స్ అంటే కూరలో కరివేపాకులే !

సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్స్ ని( Heroines ) మార్చడం అంటే కూరలో కరివేపాకు తీసేసినంత ఈజీ.

నార్త్ ఇండియన్ అమ్మాయి అయినా పర్వాలేదు లేదా మలయాళీ ముద్దుగుమ్మయిన ఓకే.వయసు తక్కువగా ఉండాలి అందంగా ఉండాలి.

దాంతో విపరీతమైన హైప్ క్రియేట్ చేసి బోలెడన్ని అవకాశాలు కుమ్మరిచేస్తారు.మన ఇండస్ట్రీ పోకడే అలా ఉంటుంది.

కొన్నాళ్లు బాగానే ఉంటుంది.ఎటు చూసినా ఆఫర్స్.

కానీ అక్కడ నుంచి ఒకటి రెండు పరాజయాలు దక్కాయో ఇక అంతే సంగతులు.

ఆలోపు మరో ముద్దుగుమ్మ ఎంట్రీ ఇస్తుంది.వీరిని తీసి పక్కన పడేస్తారు.

ఇదే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్.కానీ వీటన్నింటికి విరుద్ధంగా కొంతలో కొంతమంది మాత్రమే తమను తాము రక్షించుకుంటూ, ఇండస్ట్రీలో ఎలివేట్ చేసుకుంటూ అలా సర్వైవ్ అయిపోతు ఉంటారు.

"""/" / నిన్న మొన్నటి వరకు శ్రీలీల( Sreeleela ) పేరు ఎక్కడ చూసినా కూడా మారుమోగిపోయింది.

పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో బోలెడన్ని అవకాశాలను ఒడిసి పట్టుకుంది.

బాలకృష్ణ నుంచి మహేష్ బాబు వరకు ఎవరు చూసినా ఆమెకి పిలిచి మరి ఆఫర్స్ ఇచ్చారు.

కానీ డ్యాన్స్ కి మాత్రమే పనికొచ్చిన ఈ అమ్మడు నటనకు స్కోపు ఉన్న పాత్రలను చేయలేకపోయింది.

దాంతో జనాలకు బోర్ కొట్టేసింది.నిర్మాతలకు, దర్శకులకు హీరోయిన్ కావాల్సిన అవసరం పడింది.

దాంతో ఇప్పుడు అందరు చూపు మరో ఇద్దరు హీరోయిన్స్ పై పడింది.ఆ ఇద్దరు మరెవరో కాదు మమిత బైజు( Mamitha Baiju ) అలాగే భాగ్యశ్రీ బోర్సే.

( Bhagyashri Borse ) ప్రస్తుతం వీరి పేరు ఎక్కడ చూసినా మీడియాలో కనిపిస్తూ ఉంది.

"""/" / అయితే మమిత ఇంతకు ముందు చెప్పినట్టుగా శ్రీలీల లాగా ఏది పడితే అది చేసే టైపు కాదు.

ఆమె కంటూ ఒక టేస్ట్ ఉంది.జాగ్రత్తగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటుంది.

అందుకే ఈ అమ్మడికి ఎడ పెడా సినిమాలు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.

అయితే ఇక భాగ్యశ్రీ విషయానికి వస్తే ఈ అమ్మడు ఔరంగాబాద్ కి సంబంధించిన అమ్మాయి.

ఈమె గురించి పెద్దగా ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు.తన చదువులను నైజీరియాలో పూర్తిచేసి ఇండియాలో బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసింది, ఇప్పటి వరకు చేసింది కేవలం యారియాన్ 2 అంటూ అనే ఒక సినిమా మాత్రమే.

ఇందులో కూడా మందలో గోవిందా అన్నట్టుగా నడిపించేసింది.ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాతో( Mr Bachchan Movie ) రవితేజ కి హీరోయిన్ గా తెలుగు సినిమాకి పరిచయం కాబోతుంది.

దాంతో ఇప్పుడు అందరూ అన్ని సినిమాల్లో మమిత లేదా భాగ్యశ్రీ అంటూ హడావిడి చేస్తున్నారు.

ఈ హడావిడి ఎన్నాళ్ళు ఉంటుంది.నాలుగు సినిమాలు పడి ఒకటో రెండో ప్లాప్స్ దొరికే వరకే నడుస్తుంది.

ఆ తర్వాత మరో కొత్త హీరోయిన్ కి ఎంట్రీ దొరుకుతుంది.

బ్రహ్మంగారి కాలజ్ఞానం వల్ల ఏడాది పాటి సెన్సార్ చేయించుకోలేకపోయినా ఎన్టీఆర్ సినిమా !