ఈ హీరోయిన్ ఆ కారణంగా తన సినీ జీవితాన్ని పాడు చేసుకుందట..

తెలుగులో ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వం వహించిన "కడప రెడ్డమ్మ" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన "హీరోయిన్ రంజిత" గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.

అయితే ఈమె నటించింది తక్కువ సినిమాలలోనే అయినా ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయింది.కానీ తమిళం, మలయాళం, కన్నడ, చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆమె తీసుకున్నటువంటి పలు నిర్ణయాల కారణంగా పూర్తిగా సినీ జీవితాన్ని తానే చేజేతులా నాశనం చేసుకుంది.

అయితే ఇందులో ఓ ప్రముఖ స్వామీజీకి భక్తురాలు గా మారడంతో పూర్తిగా సినిమాలపై అశ్రద్ధ వహించింది.

దీంతో నెమ్మదిగా సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమైంది.అంతేగాక ఆ స్వామీజీతో నటి రంజిత సీక్రెట్ ఎఫైర్ ననడిపిందని అప్పట్లో పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపించాయి.

దీంతో నటి రంజిత ఇక పూర్తిగా సినిమాలకు స్వస్తి చెప్పి ఆ స్వామీజీ భక్తురాలిగా మారిపోయింది.

ఇంక అప్పటి నుంచి ఎక్కువగా పలు వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది.అయితే ఈ మధ్యకాలంలో ఈ విషయంపై స్పందించిన కొందరు సినీ ప్రముఖులు నటి రంజిత తన సినీ కెరీర్లో తీసుకున్నటువంటి పలు తప్పుడు నిర్ణయాలకి మొత్తం తన సినీ జీవితాన్ని మూల్యంగా చెల్లించుకుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక దేవుళ్ళ పై భక్తి  మరియు నమ్మకం ఉండాలి కానీ దేవుళ్ళని చెప్పుకుంటూ తిరిగే వారి మాయలో పడి సినీ కెరీర్ నాశనం చేసుకోవడం సరికాదని మరి కొందరు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..రేపటి నుంచి వర్షాలు