తెలుగులో ఫస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరో తెలుసా?

తొలి తెలుగు ప్లేబ్యాక్ సాంగ్ గా రికార్డుకెక్కిన పాట నండూరి సుబ్బారావు కలం నుంచి జాలువారిన ఈ రేయి నన్నొల్లనేరవా రాజా.

ఒక మేల్ సింగర్ పాడిన తొలి పాటగా గుర్తింపు పొందింది 1944లో వైవి రావు, భానుమతి కలిసి నటించిన తాసిల్దారు సినిమాలోనిది ఈ పాట.

ఈ పాటను పాడిన సింగర్ ఎంఎస్ రామారావు.తెలుగు సినిమా పరిశ్రమలో తొలి ప్లే బ్యాక్ సింగర్ గా ఆయన గురింపు పొందాడు.

1941లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజీలో జరిగిన లలిత సంగీత పోటీల్లో ఆయనకు మొదటి బహుమతి లభించింది.

ఆ కార్యక్రమానికి ప్రముఖ నవలా రచయిత అడవి బాపిరాజు న్యాయ నిర్ణేతగా వచ్చాడు.

రామారావు పాడిన పాట ఆయనకు చాలా నచ్చింది.సినిమాల్లోకి వెళ్లాలని రామారావుకు తొలిసారి చెప్పింది తనే.

ఆయన సలహా మేరకు సినిమాల్లో ప్రయత్నించాడు.1944లో తాసిల్దారు సినిమాతో నేప‌థ్య గాయ‌కుడిగా పరిచయం అయ్యాడు.

సుమారు రెండు దశాబ్దాల పాటు అనేక సినిమాల్లో చక్కటి పాటలు పాడాడు.ఆయన గానం అందించిన సినిమాల్లో దీక్ష‌, ద్రోహి, మొద‌టిరాత్రి, పాండురంగ మ‌హాత్మ్య‌ము, నా ఇల్లు, సీతారామ క‌ల్యాణ‌ము, శ్రీ‌రామాంజ‌నేయ యుద్ధ‌ము లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

ఈ రేయి న‌న్నొల్ల‌నేర‌వా రాజా పాట పాట‌డానికి ఆయన చాలా కష్టపడ్డాడు.ముందుగా ఈ పాటను నేర్చుకునేందుకు ఏలూరు వెళ్లాడు.

అక్కడ నండూరి వాళ్ల ఇంట్లో ఉండి ఆ పాటను నేర్చుకున్నాడు. """/"/ ఆ పాట మంచి పేరు సంపాదించడంతో ఆయన వరుస సినిమాల్లో పాటలు పాడాడు.

అటు తులసీదాస్ ర‌చించిన శ్రీ హ‌నుమాన్ చాలీసాను 1970లో తెలుగులో అనువ‌దించాడు రామారావు.

అంతేకాదు.దానికి గానం చేశారు.

అది ఆయనకు చాలా పేరు తీసుకువచ్చింది.వాల్మీకి రామాయ‌ణంలోని సుంద‌ర‌కాండ‌ను తెలుగులో ఆలపించిచారు.

ఈ సుందరకాడం ఆకాశవాణిలో ప్రసారమై మంచి పేరు తెచ్చింది.రామారావు తెనాలి తాలూకా మోప‌ర్రులో 1921 జూలై 3న జన్మించాడు.

1992 ఏప్రిల్ 20న హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లిలోని ఆయన నివాసంలో చనిపోయాడ.అటు ఆయన నివాసం ఉన్న వీధికి సుంద‌ర‌దాసు ఎం.

ఎస్‌.రామారావు వీధి అనే పేరు పెట్టారు అధికారులు.

కాఫీలో వీటిని కలిపి తీసుకోండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి!