తెలుగులో మొదటి సారి లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న నటి ఈమె ..!

తెలుగు సినిమా పరిశ్రమలో తొలి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన భామ పసుపులేటి కన్నాంబ.

తెలుగు, తమిళంలో కూడా అద్భుతంగా డబ్బింగ్ చెప్పి తనకు తానే సాటి అనిపించుకున్నది కన్నాంబ.

ఈమె తన అద్భుత నటనతో వరుస ఆఫర్లు దక్కించుకుంది.ఆ రోజుల్లోనే మద్రాసులో ఏ మూల ఏ ఆస్తి ఉందో తెలియనంతగా సంపాదించింది అంటే ఈమె ఏ రేంజిలో సినిమాలు చేసిందో అర్థం చేసుకోవచ్చు.

అంతేకాదు.కొత్త నటీనటుల్ని ఇంట్లో పెట్టుకుని భోజన ఏర్పాట్లు చేస్తూ తన ఇంటిని సత్రంలా మార్చేసింది ఈ మనసున్న మనిషి.

తెలుగు తొలి టాప్ హీరో చిత్తూరు వి నాగయ్యతో పాటు కన్నాంబ ఎన్నో సినిమాలు చేశారు.

1911లో జన్మించిన కన్నాంబ.తన తాతగారి ఇంట్లో సంగీతం నేర్చుకుంది.

ఆమె గళానికి ఓ ప్రత్యేకత ఉండేది.కన్నాంబ తన 16వ యేటనే సీనియర్ నటి అయింది.

సొంతంగా ప్రదర్శనలిచ్చే కన్నాంబను దర్శకుడు సి పుల్లయ్య సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు.

కు ఆహ్వానించారు.హరిశ్చంద్ర, ద్రౌపది వస్త్రాపహరణం, కనకధార, గృహలక్ష్మి వంటి సినిమాలతో బాగా పాపులర్ అయింది.

ఏ పాత్ర వేస్తె అందులోపరాకాయ ప్రవేశం చేసేది.ఈమె నటనకు తమిళంలో శివాజీ గణేశన్ ఆశ్చర్యపోయాడు.

ఆరోజుల్లో లక్ష రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నది కన్నాంబ.30 సినిమాల్లో నటించింది.

అందులో చాలా వరకు సినిమాలు విజయం సాధించాయి.ఇక తనతో పాటు నాటకరంగంలో గల కడారి నాగభూషణాన్ని పెళ్లాడిన కన్నాంబ తన ఆరాధ్య దేవత రాజ రాజేశ్వరి పేరిట సంస్థ నెలకొల్పి పలు సినిమాలు తీసింది.

తాను సినిమాల్లో నటిస్తుంటే.భర్త సినిమాలు తీసి నష్టాలు తేవడంతో భర్తీ చేయడం కష్టమయ్యేది.

పిల్లలు లేని కన్నాంబ దంపతులు రాజేశ్వరి అనే అమ్మాయిని పెంచుకుని సి పుల్లయ్య కొడుకు సి ఎస్ రావు తో పెళ్లి చేసారు.

అయితే నటి రాజసులోచన ప్రేమలో పడి కూతురుని నిర్లక్ష్యం చేస్తున్నాడని తెల్సి.రాజసులోచనను పిలిచి ఆశీర్వదించి పంపింది .

తర్వాత తన కూతురుకి వేరే పెళ్లి చేసింది.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా సినిమాల్లో నటించిన కన్నాంబ.

తన 53వ యేట కన్నుమూసింది.తొలి తెలుగు టాప్ హీరోయిన్ గా నిలిచిపోయింది.

టీ గ్లాస్ పట్టుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్.. ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నారా అంటూ?