బాహుబలి డైరెక్టర్ కి కరోనా నెగటివ్ …

తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకులలో ప్రముఖ దర్శకులు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు.

అయితే ఇటీవలే దర్శకుడు రాజమౌళి మరియు అతడి కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే.

 దీంతో రాజమౌళి వైద్యుల సలహాలు, సూచనల మేరకు తాను మరియు తమ కుటుంబ సభ్యులు కలిసి 14 రోజుల పాటూ హోమ్ క్వారెంటైన్ లోకి వెళుతున్నట్లు ఇటీవలే తన అధికారిక ఖాతా ద్వారా తన అభిమానులకు తెలిపాడు.

అయితే తాజాగా మరోమారు ఈ విషయంపై స్పందిస్తూ రాజమౌళి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు.

ఇందులో భాగంగా వైద్యులు సూచించిన క్వారెంటైన్ ను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం తమకు ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని విజయవంతంగా కోలుకున్నామని తెలిపాడు.

 అంతేగాక మరో మూడు వారాల తర్వాత వైద్యుల సలహా మేరకు ప్లాస్మా దానం చేయడానికి కూడా ముందుకు వస్తానని పేర్కొన్నాడు.

 దీంతో రాజమౌళి అభిమానులు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు. అంతేగాక రాజమౌళి మరియు అతడి కుటుంబ సభ్యులు కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో పలువురు సినీ సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జక్కన్న రాజమౌళి టాలీవుడ్ లో ఆర్.

ఆర్.ఆర్ అనే చిత్రానికి కి దర్శకత్వం వహిస్తున్నాడు.

 కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ లు నటిస్తుండగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

 కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి2, గురువారం2025