2021.. టాప్ దర్శకులకు జీరో ఇయర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది.అయా రంగాలను కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది.

కరోనా పుణ్యమా అని తెలుగు సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.

ఈ వైరస్ మూలంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు.పలు సినిమాల షూటింగులు నిలిచిపోయాయి.

టాలీవుడ్ పరిస్థితి మొత్తం అస్తవ్యస్థంగా తయారైంది.కొందరు టాప్ దర్శకులకు 2021 జీరో ఇయర్ గా మిగిలిపోయింది.

ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు.ఇంతకీ ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ ఏడాది బోయ‌పాటి శ్రీ‌ను, సుకుమార్, శేఖ‌ర్ క‌మ్ముల లాంటి అగ్ర ద‌ర్శ‌కులు త‌మ సినిమాల‌తో స‌త్తా చాటారు.

మంచి సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.అయితే మరికొందరు టాప్ దర్శకులు మాత్రం ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు.

వారిలో ఎస్.ఎస్.

రాజ‌మౌళి, పూరీ జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, కొర‌టాల శివ‌, సురేంద‌ర్ రెడ్డి, ప‌ర‌శురామ్, హ‌రీశ్ శంక‌ర్, అనిల్ రావిపూడి ఉన్నారు.

వీరికి మాత్రం 2021 క్యాలెండర్ ఇయర్ మిస్సింగ్ ఇయర్ గా మారిపోయింది.అటు త్రివిక్ర‌మ్, అనిల్ రావిపూడిని మిన‌హా మిగిలిన అంద‌రు ద‌ర్శ‌కులకి క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా 2020 ఏడాది సైతం జీరో ఇయర్ గానే ఉండటం విశేషం.

"""/" / ఈ ఏడాది ఎలా ఉన్నా వచ్చే ఏడాది మాత్రం.అగ్ర దర్శకులకు చెందిన పలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

అందులో పలు భారీ బడ్జెట్ సినిమాలున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి సందడి చేయబోతున్నాడు.

ఆచార్య‌తో కొర‌టాల శివ‌ సత్తా నిరూపించుకోబోతున్నాడు.ఏజెంట్ తో సురేంద‌ర్ రెడ్డి జనాల ముందుకు వస్తున్నాడు.

స‌ర్కారు వారి పాట‌తో ప‌ర‌శురామ్, భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ తో హ‌రీశ్ శంక‌ర్, ఎఫ్ 3తో అనిల్ రావిపూడి జనాలను ఆకట్టుకోబోతున్నారు.

మొటిమలు మచ్చలుగా మారి ముఖంపై అసహ్యంగా కనిపిస్తున్నాయా.. ఈ హోమ్ మేడ్ టోనర్ వాడితే క్లియర్ స్కిన్ మీ సొంతమైనట్లే!