ఈ డైరెక్టర్ సినిమాలలోని హీరోల క్యారెక్టర్లన్నీ తేడాగా ఉంటాయి..?
TeluguStop.com
తెలుగు సినిమాలతో పోలిస్తే తమిళ సినిమాల హీరోలు చాలా భిన్నమైన పాత్రలు పోషిస్తుంటారు.
ధనుష్, సూర్య, కార్తీక్, కమల్ హాసన్ లాంటి హీరోలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.వాస్తవానికి తమిళ దర్శకులే కమర్షియల్ సినిమాలు కాకుండా ఏదైనా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయాలనుకుంటారు.
హీరోల క్యారెక్టర్ ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉండేలాగా చూసుకుంటారు.ముఖ్యంగా దర్శకుడు సెల్వ రాఘవన్( Director Selva Raghavan ) హీరోలను చాలా భిన్నంగా చూపిస్తాడు.
దూల్ పేట, యుగానికి ఒక్కడు, నన్ను వదిలి నీవు పోలేవులే సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ ఎంత తేడాగా ఉంటాయో తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.
నిజానికి ఇవన్నీ తమిళ సినిమాలు.వీటిని తెలుగులో తీస్తే కూడా సూపర్ హిట్ అయ్యాయి.
వీటన్నిటికంటే ఈయన తీసిన 7/g బృందావనీ కాలనీ ( 7/g Brindavani Colony
)హీరో క్యారెక్టర్ చాలా తేడాగా ఉంటుంది.
అమ్మాయిలను ఒక శృంగార వస్తువుగా అతను చూస్తుంటాడు.ఈ రోల్ హీరోయిన్ చేత చెప్పు దెబ్బలు కూడా తింటుంది.
ఇదొక చాలా బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు.ఫస్టాఫ్ తర్వాత మంచి క్యారెక్టర్‌గా మలిచి ప్రేక్షకులకు నచ్చేలాగా చేశాడు కానీ ఇది మాత్రం చాలా తేడా క్యారెక్టర్ అని చెప్పుకోవాలి.
హీరో ఎలా ఉన్నా కూడా ఈ సినిమాలో కథ మంచిగా ఉండటం వల్ల అది సూపర్ హిట్ అయింది.
"""/" /
ఈ దర్శకుడు తీసిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే కూడా చాలా బాగుంటుంది.
ఇందులోని హీరో కేరెక్టరైజేషన్ కూడా విచిత్రంగా ఉంటుంది.ఈ మూవీ తమిళ వెర్షన్‌లో ధనుష్ నటించాడు.
దాన్ని చూస్తే మనకి హీరో చాలా డిఫరెంట్ వేలో ప్రాజెక్ట్ అవుతున్నాడని తెలుస్తుంది.
ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కరెక్ట్ గా రాశాను కానీ హీరో క్యారెక్టర్ కొంచెం భిన్నంగా రాసి ఆశ్చర్యపరిచాడు.
బావను పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోయిన్ ను హీరో తనవైపు తిప్పుకుంటాడు ఇప్పటిదాకా ఇలాంటి వెరైటీ హీరో రోల్ తెలుగు సినిమా వాళ్ళు చూడలేదు.
"""/" /
ఇక ధనుష్, సోనియా అగర్వాల్ ( Dhanush, Sonia Aggarwal )హీరో హీరోయిన్లగా నటించిన ‘కాదల్ కొండెన్ (2003)’ సినిమా( 'Kadal Konden (2003)' Movie ) కూడా విచిత్రంగా సాగుతుంది.
ఇందులో హీరో చాలా పేదవాడు.అనాధాశ్రమంలో పెరుగుతాడు కానీ మంచి టాలెంటెడ్.
తర్వాత సిటీలో చదువుకోడానికి వెళ్తాడు.కాలేజీలో హీరోయిన్ అతని బీద పరిస్థితిని చూసి చేరదీస్తుంది.
ఒక ఫ్రెండ్ లాగానే అతడిని భావిస్తుంది.వేరొక వ్యక్తిని ఆమె ప్రేమిస్తుంది కానీ హీరో ఆమెపై రొమాంటిక్ ఫీలింగ్స్ పెంచుకుంటూ ఒక సైకో లాగా ప్రవర్తిస్తాడు.
ఆమెను తనతో పాటు అడవిలోకి తీసుకెళ్తాడు.హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్‌ని చంపాలనుకుంటాడు.
ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ చూసి చాలా మంది మతి పోయిందంటే అతిశయోక్తి కాదు.
ఈ మూవీని తెలుగులో అల్లరి నరేష్( Allari Naresh ) "నేను"( Nenu ) పేరుతో తీశాడు.
హీరో క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా ఉన్నా సరే ఈ డైరెక్టర్ విజయాలు సాధిస్తుంటాడు.అదే అతని ప్రత్యేకత!.
వైరల్ వీడియో: కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో విందు ఏర్పాటు