నిర్మాతలుగా కోట్లు కొల్లగొడుతున్న మన టాలీవుడ్ డైరెక్టర్స్.. ఎలానో తెలుసా ?
TeluguStop.com
కేవలం దర్శకులు దర్శకత్వమే వహించాలి నిర్మాతలు నిర్మాణమే చేయాలి అంటే కుదరదు.ఇక్కడ లెక్కలు మారిపోయాయి.
ఇప్పుడు తెలుగు సినిమాలో ఉన్న దర్శకులు అంతా కూడా నిర్మాతలుగా కూడా చాలా బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఓవైపు తమ సినిమాలు తీసుకుంటూనే మరోవైపు వేరే దర్శకుల సినిమాలకు నిర్మాతలుగా కూడా మారుతున్నారు.
అలా డైరెక్టర్స్ కం ప్రొడ్యూసర్స్ ఎవరు ? ఎలాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
H3 Class=subheader-styleత్రివిక్రమ్/h3p """/" /
ఫార్చ్యూన్ ఫోర్ అనే పేరుతో చాలా రోజులుగా త్రివిక్రమ్ తన భార్య పేరు పై ఒక నిర్మాణ సంస్థ నడిపిస్తున్నారు.
ఈ నిర్మాణ సంస్థ నుంచి ఇటీవల డీజె టిల్లు స్క్వేర్ ( Tillu Square )కూడా విడుదలైంది ఇవి కాకుండా బాలకృష్ణ తో, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, విశ్వక్సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలను నిర్మిస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్ తో కలిపి ఈ చిత్రాలను తీస్తున్నారు.h3 Class=subheader-styleసుకుమార్/h3p """/" /
సుకుమార్( Sukumar ) రైటింగ్స్ పేరుతో చాలా రోజులుగా నిర్మాతగా మారిపోయి బిజీ అయిపోయారు.
సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 తో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి కూడా నిర్మాతగా మారారు.
H3 Class=subheader-styleకొరటాల శివ/h3p """/" /
జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమా( Devara Movie )తో బిజీగా ఉన్న కొరటాల శివ సైతం నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు.
కృష్ణమ్మ అనే ఒక సినిమాను ఒక సత్యదేవ్ హీరోగా పరిటాల శివ సమర్పణలో తెరకెక్కబోతోంది.
వీలు మాత్రమే కాదు పూరి జగన్నాథ్ చాలా రోజులుగా నిర్మాతగానే కొనసాగుతున్నారు ఆయన ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు దానికి సొంతంగా పూరినే నిర్మాతగా ఉన్నారు.
అలాగే అనిల్ రావిపూడి సైతం గాలి సంపత్ నిర్మాణంలో వాటా పంచుకున్నారు.రాజమౌళి సైతం బ్రహ్మోత్సవ తెలుగు వర్షన్ కి సమర్పకుడిగా ఉండగా సందీప్ రెడ్డివంగా అర్జున్ రెడ్డి మరియు అనిమల్ సినిమాలకు నిర్మాతగా ఉన్నారు.
ఇటీవల కళ్యాణ్ కృష్ణ కురసాల లంబసింగి అనే సినిమాను సమర్పించారు.