Tollywood Directors: 2023 లో డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ పై ఫోకస్ చేస్తున్న దర్శకులు
TeluguStop.com
కొడితే బాల్ బౌండరీ దాటాలి కానీ ఈ సింగిల్స్ మనతో కాదబ్బా.ఎంత సేపు మెగాఫోన్ పట్టుకొని యాక్షన్ అని క్లాప్ కొట్టిస్తాం చెప్పండి .
ఒక్కోసారి మనకు కూడా క్లాప్ కొడితే ఆ కిక్కే వేరప్పా అంటూ చాల ఏళ్లుగా డైరెక్టర్ యాక్టింగ్ వైపు అప్పుడప్పుడు తొంగి చూస్తున్నారు.
కానీ ఈ మధ్య కాలంలో కుర్ర దర్శకులు కూడా ఈ పనిని బాగా చేస్తున్నారు.
మరి డైరెక్షన్ కాకుండా యాక్టింగ్ కూడా చేస్తున్న ఆ దర్శకులు ఎవరు ? ఆ సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
H3 Class=subheader-styleఅనుదీప్/h3p
జాతిరత్నాలు సినిమాతో( Jathiratnalu ) ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు అనుదీప్.
( Anudeep KV ) మెగాఫోన్ పట్టుకోవడానికి జీవితం అంతా ఉండి కానీ యాక్టింగ్ చేయాలంటే వయసు అయిపోతే కష్టం అనుకున్నాడో ఏమో మ్యాడ్( Mad Movie ) అనే సినిమాలో నటించి అందరికి బంపర్ షాక్ ఇచ్చాడు.
ఈ సినిమాలో అనుదీప్ మంచి కామెడీ పాత్రా పోషించినట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ట్రేండింగ్ లో వుంది.
"""/" /
H3 Class=subheader-styleశ్రీకాంత్ అడ్డాల/h3p
గత వారం విడుదల అయినా పెద్ద కాపు సినిమా( Pedhakapu Movie ) ఘోర పరాజయం పొంది డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు శ్రీకాంత్ అడ్డాల.
( Srikanth Addala ) కానీ యాక్టర్ గా మాత్రం ఇరగదీసేసాడు.ఇప్పటి వరకు ఎవరు చూడని షెడ్ తనలో ఉందని శ్రీకాంత్ నటన చూస్తే అర్ధం అయిపోతుంది.
"""/" /
H3 Class=subheader-styleవెంకటేష్ మహా/h3p
ఈ ఏడాది ఉస్తాద్ సినిమాలో( Ustaad Movie ) హీరో కి తండ్రి పాత్రలో నటించాడు కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా.
( Venkatesh Maha ) గత ఏడాది నుంచి వరసగా సినిమాల్లో కనిపిస్తున్నాడు.
అంతే కాదు యాంగర్ టేల్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించడం విశేషం.
ఇక ముందు ముందు కూడా మరిన్ని సినిమాల్లో నటించడానికి ఉత్సహాహంగా ఉన్నాడు.మరి ఈ దర్శకులే కాదండోయి ఇంకా చాల మంది యంగ్ మరియు ట్యాలెంటెడ్ కుర్రాళ్ళు సినిమాలు తీస్తూ తామే దర్శకత్వం వహిస్తున్నాడు.
మేం ఫెమస్ సినిమా కూడా అలంటి ఒక సినిమానే.