రెమ్యునరేషన్స్‌ భారీగా పెంచేసిన టాలీవుడ్ డైరెక్టర్స్‌.. ఎంతో తెలిస్తే..?

ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్లు( Tollywood Directors ) హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగారు.మన దర్శకులు తీసే సినిమాలు పాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.

వివిధ రకాల జానర్లలో మనోళ్లు సరికొత్త కథలతో సినిమాలు తీస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

కొందరు దర్శకులు అయితే వరుసగా భిన్నమైన కథలతో సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు.

రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ వర్మ లాంటి స్టార్ డైరెక్టర్ల నెక్స్ట్ సినిమాల కోసం కేవలం తెలుగు వాళ్లే కాకుండా భారతదేశం వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

అంటే వీళ్లు పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.అయితే పెరిగిన స్టార్డమ్‌, రేంజ్, కలెక్షన్లు సక్సెస్‌లకు తగినట్లే ఈ దర్శకులు తమ రెమ్యునరేషన్( Remuneration ) భారీగా పెంచారని ప్రచారం జరుగుతోంది.

రాజమౌళి మినహాయిస్తే మిగిలిన స్టార్ డైరెక్టర్లలందరూ రెమ్యునరేషన్ భారీ తీసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది.

దాని ప్రకారం ఎవరు ఎంత పుచ్చుకుంటున్నారో తెలుసుకుందాం.h3 Class=subheader-style• సుకుమార్/h3p లెక్కల మాస్టారు సుకుమార్( Sukumar ) ‘పుష్ప ‘ సినిమాతో చాలా పెద్ద హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

దీనికంటే ముందు ఈ దర్శకుడి సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ వరకే పరిమితమయ్యాయి.కానీ పుష్ప తర్వాత అతని సినిమా కోసం భారతదేశంలోనే కాకుండా మిగతా దేశాల ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

ఆయన సినిమాలకు చాలానే ఎక్కువ డబ్బులు వసూలు అవుతాయని చెప్పవచ్చు.అయితే ఈయన రూ.

100 కోట్ల కలెక్షన్లు తీసుకొస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపు రూ.

60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా సమాచారం.ఇది దాదాపు స్టార్ హీరోతో సమానం అని చెప్పుకోవాలి.

"""/" / H3 Class=subheader-style• నాగ్‌ అశ్విన్/h3p కల్కి సినిమాతో నాగ్‌ అశ్విన్‌( Nag Ashwin ) రూ.

1,000 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు.దీని తర్వాత ఈ దర్శకుడు తన శాలరీ బాగా పెంచేసినట్లు సమాచారం.

నిజానికి నాగ్ అశ్విన్ తీసిన సినిమాలను వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్‌ చేస్తుంది.ఈ ప్రొడక్షన్ హౌస్ నాగ్ అశ్విన్ మామ గారిదే.

అయినా సరే డైరెక్టర్‌గా పొందాల్సిన అమౌంట్ తీసేసుకుంటాడు.ప్రాఫిట్స్ వస్తే ఒక విధంగా, నష్టాలు వస్తే మరో విధంగా డబ్బులు తీసుకునేటట్టు ఈయన ఒక డీల్ కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం.

ఇప్పుడు ఈ దర్శకుడు ఒక్కో మూవీకి రూ.50 కోట్ల వరకు మనీ తీసుకుంటున్నాడట.

"""/" / H3 Class=subheader-style• కొరటాల శివ/h3p కొరటాల శివ( Koratala Siva ) కూడా చాలా మంచి సినిమాలు తీస్తాడు.

దేవర సినిమాతో పాన్ ఇండియన్‌ డైరెక్టర్ కాబోతున్నాడు.ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇంచుమించు రూ.

40 కోట్ల వరకు శాలరీ అందుకుంటున్నట్లుగా టాక్‌ నడుస్తోంది.దేవర సినిమా హిట్టైతే ఇతను రూ.

50 కోట్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఛాన్స్ ఉంది.ఏది ఏమైనా ఈ దర్శకుల శాలరీలు హీరోలతో సమం అయ్యాయని చెప్పుకోవచ్చు.

వీళ్ళు తీసే సినిమాల్లో హీరో, దర్శకుడు, హీరోయిన్, విలన్ రెమ్యునరేషన్లు రూ.200 కోట్లకు మించి ఉంటాయని చెప్పుకోవచ్చు.

సాంకేతిక లోపంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు..