ఆ టాలెంటెడ్ దర్శకులను చూసి రాజమౌళి అసూయ పడుతున్నారా.. ఏం జరిగిందంటే?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్, మాలీవుడ్ హీరోల హవానే ఎక్కువగా నడుస్తోంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.

మాలీవుడ్ లో ఏ విధంగా అయితే టాలీవుడ్ హీరోలను ఆదరిస్తున్నారో అదేవిధంగా తెలుగు కూడా మాలీవుడ్ అదే రేంజ్ లో ఆదరణ లభిస్తోంది.

అనువాద రూపంలో ఆ సినిమాలు ఇక్క‌డా మంచి విజ‌యాలు సాధిస్తున్నాయి.అంతేకాకుండా కోట్ల వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి.

ఇటీవ‌ల రిలీజ్ అయిన మంజుమ్మల్ బాయ్స్, ప్రేమ‌లు( Manjummel Boys Premalu ) లాంటి సినిమాలు మంచి విజ‌యం సాధించిన విషయం తెలిసిందే.

"""/"/ ఈ సినిమాలు బాగుంటే క‌టౌట్ తో ప‌నిలేద‌ని మ‌రోసారి నిరూపించాయి.తాజాగా మ‌ల‌యాళం న‌టుల ట్యాలెంట్ ని చూసి ద‌ర్శ‌క శిఖ‌రం రాజ‌మౌళి( Director Rajamouli ) సైతం ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోయారు.

మ‌ల‌యాళం లో మంచి న‌టులు ఉన్నార‌ని చెప్ప‌డానికి నాకు కొంత అసూయ‌గా ఉంది.

నేను యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సాధించే చ‌ప్ప‌ట్లు మ‌ల‌యాళం న‌టులు చిన్న ఎక్స్ ప్రెష‌న్స్ తో సొంతం చేసుకుంటున్నారు.

అందుకు వాళ్ల‌ను క‌చ్చితంగా మెచ్చుకోవాల్సిందే.అది అంత ఈజీ కాదు.

ఎంతో హోమ్ వ‌ర్క్ చేస్తే త‌ప్ప రాదు. """/"/ వాళ్లు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారు అనే దానికి వాళ్ల సక్సెస్ ని చూసి చెప్పవచ్చు.

అక్క‌డ ద‌ర్శ‌కులు ప్ర‌తీ పాత్ర‌ని ఎంతో శ్ర‌ద్ద‌గా తీర్చి దిద్దుతారు.అందుకే ఇది సాధ్యం అవుతుంది.

మా కార్తికేయ ప్రేమ‌లు అనే సినిమాతో డిస్ట్రిబ్యూట‌ర్ గా మారినందుకు సంతోషిస్తున్నా.ఇలాంటి సినిమాలు మ‌రిన్ని రావాలి అని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితఇంత‌వ‌ర‌కూ రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఏ సినిమాలో మ‌ల‌యాళ న‌టులు( Malayalam Actors ) లేరు.

ఇత‌ర భాష‌ల నుంచి హీరోయిన్లు తెచ్చుకున్నారు గానీ.మ‌ల‌యాళం న‌టుల‌కు ఇంత‌వ‌ర‌కూ అవ‌కాశం ఇవ్వ‌లేదు.

మ‌రి ఎస్ ఎస్ ఎంబీ 29 లో అక్క‌డ ప్ర‌తిభ‌ను గుర్తించి వాళ్ల‌కు అవకాశాలిస్తారేమో చూడాలి.

అయితే రాజమౌళి వీలైనంత వ‌ర‌కూ తెలుగు న‌టుల‌తోనే తెర‌ను నింపేస్తారు.హీరోయిన్ల ని దిగుమ‌తి చేస్తారు త‌ప్ప న‌టుల విష‌యంలో ఆయ‌న స్థానిక‌త‌కు పెద్ద పీఠ వేస్తారు.

చాలా రేర్ గానే బ‌య‌ట న‌టులు క‌నిపిస్తారు.

ఆ కారణంతోనే జబర్దస్త్ మానేశాను… మల్లెమాల వారిపై అవినాష్ షాకింగ్ కామెంట్స్!